JUDA’s: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ప్రజా ఆరోగ్యం కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడి
Junior doctors call off strike : తెలంగాణ జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు సమ్మె విరమించారు...
Junior doctors call off strike : తెలంగాణ జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు సమ్మె విరమించారు. ప్రజా ఆరోగ్యం కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అన్ని డిమాండ్లు నేరవేరక పోయినా, ముఖ్యమంత్రి నుంచి వచ్చిన సానుకూల స్పందన తో ఆందోళన విరమించామని పేర్కొన్నారు. ఎక్స్ గ్రేషియ పై ప్రభుత్వం త్వరగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జుడాలు కోరుతున్నారు. ఇలా ఉండగా ఇప్పటికే సీఎం కేసీఆర్ జూనియర్ డాక్టర్ల డిమాండ్లకు చాలా వరకూ సానుకూలంగా స్పందించారు. కరోనా సేవలందిస్తున్న జూనియర్ డాక్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్ లో ఇప్పటికే అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలని.. ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలమేరకు ఎక్స్ గ్రేషియాను కూడా అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వారి కోరికమేరకు సత్వరమే అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సీఎం నిర్ణయించారు. మూడు సంవత్సరాల వైద్య విద్య అభ్యసించి కోవిడ్ సేవల కొరకు కొనసాగుతున్న వైద్య విద్యార్థులకు కూడా సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనాన్ని అందించాలని సీఎం ఆదేశాలిచ్చారు.
Read also : Covid situation review : మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ.. పలు కీలక అంశాలపై నిర్ణయాలు