ఒడిశాలో పుట్టిన బిడ్డలకు ఇప్పుడు ఆ పేరు ట్రెండింగ్…ఏం పేరో తెలుసా?

Cyclone Yaas: ఒడిశా తీర ప్రాంతాలపై తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపింది. మొత్తానికి యాస్ తుపాను ఒడిశా ప్రజలకు ఎప్పటికీ మరవలేని అనుభవాన్ని మిగిల్చింది.

ఒడిశాలో పుట్టిన బిడ్డలకు ఇప్పుడు ఆ పేరు ట్రెండింగ్...ఏం పేరో తెలుసా?
Representative Pic
Follow us

|

Updated on: May 27, 2021 | 7:44 PM

ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో యాస్(Yaas) తుపాను బీభత్సం సృష్టించింది. రెండు రాష్ట్రాలను వణికించిన తుపాను బుధవారం ఉదయం ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలోని బహనాగ వద్ద తీరాన్ని దాటింది. ఒడిశా తీర ప్రాంతాలపై తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపింది. మొత్తానికి యాస్ తుపాను ఒడిశా ప్రజలకు ఎప్పటికీ మరవలేని అనుభవాన్ని మిగిల్చింది. తుపాను రాష్ట్రాన్ని గజగజ వణికించిన వేళ ఒడిశాలో దాదాపు 300 మంది శిశువులు జన్మించారు. వీరిలో కొందరు తుపాను బీభత్సం సృష్టించిన మంగళవారం రాత్రి జన్మించగా…మరికొందరు తుపాను తీరందాటిన బుధవారంనాడు జన్మించారు. మరి తుపాను అనుభవాన్ని మర్చిపోకూడదనుకున్నారో? తుపాను పేరు సింపుల్ గా బాగా ఉందనుకున్నారో తెలీదు కానీ…చాలా మంది తమ పిల్లలకు యాస్ (Yaas) అని నామకరణం చేశారు. యాస్ తుపాను రోజునే వారు పట్టినందున…తుపానుకు గుర్తుగా ఆ పేరు పెట్టుకున్నట్లు వారి కుటుంబీకులు చెబుతున్నారు.

యాస్ కంటే బాగున్న పేరు వెతికినా దొరకడం లేదని, అందుకే బుధవారం పుట్టిన తన మగబిడ్డకు ఆ పేరు పెట్టినట్లు బాలాసోర్‌కు చెందిన సోనాలి తెలిపారు. తన కుమార్తె పుట్టిన రోజును అందరూ గుర్తు పెట్టుకుంటారని బుధవారంనాడు జన్మించిన తన బిడ్డకు యాస్‌గా పేరుపెట్టినట్లు కేంద్రపార జిల్లాకు చెందిన సరస్వతి బైరాగి తెలిపారు. రాష్ట్రంలోని అందరూ గుర్తుపెట్టుకునే రోజు తన బిడ్డ పురుడుపోసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఒడిశాలోని పలు జిల్లాల్లోనూ చాలా మంది తమ శిశువులకు యాస్‌గా నామకరణం చేశారు.

తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో తుపాను ప్రభావిత లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 6500 మంది నిండు గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఒడిశా అధికారులు ముందే ప్రకటించారు. తుపాను కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని మంగళవారం రాత్రికే వారు స్థానిక ఆస్పత్రులు, మా గృహాలు (ప్రసవ కేంద్రాలు)కు చేరుకున్నారు. అక్కడ వారికి స్థానిక అధికారులు తగిన వసతులు కల్పించారు.

వాస్తవానికి యాస్ తుపానుకు ఆ పేరును ఓమన్ దేశం సూచించింది. పర్షియన్ బాషలోకు చెందిన యాస్(Yaas) అంటే మల్లె పువ్వు అని అర్థమట.

ఇవి కూడా చదవండి…

 నిద్ర‌లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా.? అయితే ఈ సింపుల్ టెక్నిక్స్‌ను ఫాలో అవ్వండి.. స‌మ‌స్య నుంచి..

పిల్ల కాదు.. చిచ్చర పిడుగు.. చిన్నారి పట్టుదలకు నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..