బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడుతున్న మెడిసిన్ పై అత్యధిక దిగుమతి సుంకం ఎందుకు ? కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ కోర్టు

బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే యాంఫోటెరిసిన్-బీ మందుపై అత్యధిక దిగుమతి (కస్టమ్స్) సుంకం ఎందుకు విధించారని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వేలాది మంది...

బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడుతున్న మెడిసిన్ పై అత్యధిక దిగుమతి సుంకం ఎందుకు ?  కేంద్రాన్ని  ప్రశ్నించిన ఢిల్లీ కోర్టు
Black Fungus Medicine
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 27, 2021 | 7:29 PM

బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే యాంఫోటెరిసిన్-బీ మందుపై అత్యధిక దిగుమతి (కస్టమ్స్) సుంకం ఎందుకు విధించారని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వేలాది మంది ప్రాణాలను కాపాడేందుకు ఈ మెడిసిన్ ఎంతయినా అవసరమని, అందువల్ల దీనిపై విధించిన సుంకాన్ని మాఫీ చేసే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. ఇండియాలో అసలే ఈ మెడిసిన్ కొరత తీవ్రంగా ఉందని పేర్కొంది. ఈ మెడిసిన్ ని ఏ వ్యక్తి అయినా దిగుమతి చేసుకున్నప్పుడు సుంకం మాఫీ కానంతవరకు తాను దీన్ని తప్పక చెల్లిస్తానన్న బాండ్ ను (హామీ పత్రాన్ని) అతని నుంచి తీసుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. కాగా ఈ అంశాన్ని తాము కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు దృష్టికి తీసుకువెళ్తామని కేంద్రం తరఫు లాయర్ కీర్తిమాన్ సింగ్ తెలిపారు. ఇది ఆ సంస్థతో ముడిపడిన విషయమన్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధికి గురైన తన గ్రాండ్ ఫాదర్ కు యాంఫోటెరిసిన్-బీ మందు అత్యవసరమైందని కానీ దీనిపై కేంద్రం చాలా ఎక్కువ సుంకం విధించిందని ఇక్రా ఖాలిద్ అనే అడ్వొకేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ముఖ్యమైన, ప్రాణాధారమైన మందులపై అత్యధిక సుంకం విధించిన కారణంగా సామాన్యులు వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. ఆ మధ్య కొన్ని రకాల కోవిద్ మందులపై సుంకాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ రాగా,కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్..అందుకు కారణాలను విశ్లేషించి చూపారు. అయితే ఈ డిమాండ్ ను సహేతుకంగా పరిశీలిస్తామని కూడా అన్నారు. దేశంలో 11 వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర మంత్రి సదానంద గౌడ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. మరిన్ని చదవండి ఇక్కడ : మాస్క్ పెట్టుకోకపోతే మరి ఇంత దారుణమా యూపీ లో చిచ్చు రేపిన మాస్క్ వివాదం : Mask Issue In UP Video.

 నా పిల్లల్ని అందుకే బయటకి తీసుకురాను..!పిల్లలపై ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటానంటున్న ఎన్టీఆర్..వీడియో.:Jr.NTR Video Vijay Devarakonda Video : విజయ్ దేవరకొండ ను రిజెక్ట్ చేసిన 25 మంది హీరోయిన్లు.. రౌడీ క్రేజ్ తగ్గినట్టేనా…?