రెండు వేర్వేరు వ్యాక్సిన్స్ ఇస్తే ఏం జరుగుతుంది ? ప్రకటన చేసిన కేంద్రం
ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చినప్పటికీ ..అంటే మొదట ఓ రకం టీకామందు, రెండో సారి మరో రకం టీకా మందు ఇచ్చినప్పటికీ దాని ప్రభావం పెద్దగా ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.
ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చినప్పటికీ ..అంటే మొదట ఓ రకం టీకామందు, రెండో సారి మరో రకం టీకా మందు ఇచ్చినప్పటికీ దాని ప్రభావం పెద్దగా ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. యూపీలోని సిద్దార్థ నగర్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన కొందరికి మొదటి డోసు కొవాగ్జిన్ ఇవ్వగా,,రెండో సారి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు. సుమారు 20 మంది ఇలా వేర్వేరు టీకామందులు తీసుకున్నారు. అయితే ఇలా వేర్వేరు టీకామందులు ఇచ్చినప్పటికీ శరీరంపై అవి చూపగల ప్రభావం స్వల్పంగా ఉంటుందని వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై గల జాతీయ నిపుణుల బృందం చైర్మన్ డా.వీ,కె. పాల్ తెలిపారు. అయినా ఈ జటిలమైన అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. చెప్పుకోదగిన ప్రతికూల పరిణామాలు తలెత్తే అవకాశం చాలా తక్కువ అని ఆయన పేర్కొన్నారు. ఏమైనా ఈ అంశాన్ని స్క్రూటినీ చేయాల్సి ఉందన్నారు. సిధార్థ నగర్ జిల్లాలోని గ్రామంలో జరిగింది అతి పెద్దపొరబాటని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమేనని అధికారులు మాత్రం వ్యాఖ్యానించారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని, బాధ్యులైనవారిపై చర్య తీసుకుంటామని వారు చెప్పారు.
మహారాష్ట్రలో కూడా 72 ఏళ్ళ వ్యక్తికి ఇలాగే మొదట ఓ రకం వ్యాక్సిన్, ఆ తరువాత మరో రకం టీకామందు ఇచ్చారు. ఆ తరువాత ఆయన శరీరంలో అక్కడక్కడా దద్దుర్లు ఏర్పడ్డాయని ఆయన కొడుకు తెలిపాడు. అయితే ఆయనకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. ఏమైనా వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చినా అంత ప్రమాదమేమీ లేదని, దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఇంకా రీసెర్చ్ జరుగుతోందని లాన్సెట్ జర్నల్ ఆ మధ్య పేర్కొంది. మరిన్ని చదవండి ఇక్కడ : నా పిల్లల్ని అందుకే బయటకి తీసుకురాను..!పిల్లలపై ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటానంటున్న ఎన్టీఆర్..వీడియో.:Jr.NTR Video Vijay Devarakonda Video : విజయ్ దేవరకొండ ను రిజెక్ట్ చేసిన 25 మంది హీరోయిన్లు.. రౌడీ క్రేజ్ తగ్గినట్టేనా…?