ఇండియాలో కోవిద్ మరణాలపై ‘చెత్త వార్తలు’…, న్యూయార్క్ టైమ్స్ పై కేంద్రం నిప్పులు
ఇండియాలో కోవిద్ మరణాలు ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న 3 లక్షల కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయంటూ న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురితమైన వార్తపై కేంద్రం మండిపడింది...
ఇండియాలో కోవిద్ మరణాలు ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న 3 లక్షల కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయంటూ న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురితమైన వార్తపై కేంద్రం మండిపడింది. మూడు దేశ వ్యాప్త సీరో సర్వేలు, లేదా యాంటీ బాడి టెస్టులపై ఆధారపడిన డేటాను పురస్కరించుకుని ఈ లెక్కలు చెబుతున్నామని ఆ పత్రిక పేర్కొంది. బహుశా 42 లక్షల మరణాలు సంభవించాయని, ఇండియాలో అధికారిక లెక్కలు తమ పాండమిక్ వాస్తవ పరిస్థితిని చాలా తక్కువగా అంచనా వేసినట్టు కనిపిస్తున్నాయని ఈ వార్తలో పేర్కొన్నారు. అయితే దీనిపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీ.కె. పాల్ తీవ్రంగా స్పందించారు. పాజిటివ్ కోవిద్ టెస్టులకన్నా ఇన్ఫెక్షన్లు ఎక్కువ ఉండవచ్చునని, కానీ మరణాలు ఇన్ని లేవని ఆయన చెప్పారు. వీటి విషయంలో కేంద్రం లేదా రాష్ట్రాలు కాస్త ఆలస్యంగా రిపోర్టు చేస్తే చేసి ఉండవచ్చునని, కానీ కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్రాలు గానీ ఈ విషయంలో వాస్తవాలు దాచిపెట్టవని ఆయన అన్నారు. ఇన్ఫెక్షన్ కు గురై మరణించినవారి శాతం 0.05 శాతం కాగా-ఆ పత్రిక 0.3 శాతం అని పేర్కొన్నదని, ఇదేమిటని ఆయన ప్రశ్నించారు. ఇంత శాతమని మీరు నిర్ణయించారా అని వ్యాఖ్యానించారు. లేక ఇది యూనివర్స్ లెక్కా అని కూడా పేర్కొన్నారు. ఐదారుగురు కలిసి ఒకరికొకరు ఫోన్ కాల్స్ చేసుకుని ఆ తరువాత నెంబర్లను పారవేస్తారని, అలాగే ఈ వార్తను కూడా తయారు చేసి ఉంటారని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనను ప్రతిష్ట్మాత్మక పత్రికగా చెప్పుకునే న్యూయార్క్ టైమ్స్ ఈ విధమైన వార్తలను ప్రచురించరాదన్నారు.
ఇండియాలో గత 20 రోజులుగా కోవిద్ కేసులు తగ్గుతూ వస్తున్నాయని, 20 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు కూడా చాలా తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్య మంతిత్వ శాఖ తెలిపింది. సెకండ్ కోవిద్ వేవ్ ని కట్టడి చేయగలిగామని, ఆంక్షలు సడలిస్తున్నప్పటికీ కేసులు తగ్గుతున్నాయని వివరించింది. గత 24 గంటల్లో దేశంలో 2.11 లక్షల కోవిద్ కేసులు నమోదయ్యాయని, 3,847 మంది రోగులు మరణించారని తెలిపింది. మొత్తం కేసులు 2.73 కోట్లు కాగా మొత్తం మృతుల సంఖ్య 3.15 లక్షలని స్పష్టం చేసింది. మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : COVID-19 Fact Check video:వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతారా ?నెట్టింట్లో వైరల్ పోస్ట్..వీడియో.
మాస్క్ పెట్టుకోకపోతే మరి ఇంత దారుణమా యూపీ లో చిచ్చు రేపిన మాస్క్ వివాదం : Mask Issue In UP Video.