India Post Car Driver: పదో తరగతి అర్హతతో ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు.. చివరి తేదీ.
India Post Staff Car Driver: ఇండియా పోస్ట్ స్టాఫ్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డీనరీ గ్రేడ్) పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 25 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు...
India Post Staff Car Driver: ఇండియా పోస్ట్ స్టాఫ్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డీనరీ గ్రేడ్) పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 25 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. నిజానికి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 2021 మే 26న ముగియాల్సి ఉంది. కానీ అభ్యర్థుల కోసం మరో అవకాశం ఇచ్చారు. దీంతో గడువును పెంచారు. దరఖాస్తుల స్వీకరణ రేపటితో (25-06-2021)తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌పై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు…
* డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థులకు మూడేళ్ల లైట్, హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి. * అభ్యర్థుల వయస్సు 2021 మే 26 నాటికి 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. * అభ్యర్థులు ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోని దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. * అనంతరం ఆ దరఖాస్తు ఫామ్‌తో పాటు.. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి ది సీనియర్ మేనేజర్, మెయిల్ మోట్ సర్వీస్, చెన్నై అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. * నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్‌లో Recruitment సెక్షన్‌లో తెలుసుకోవచ్చు.
బెంగాల్ లో బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి మూకుమ్మడి వలసలు, ‘శానిటైజర్ తో శుద్ధి చేసుకుని మరీ’ !
ఏనుగుల మంద వెలి వేసిందని… ఊరిమీద పడిన గజరాజు… రెండు నెలల్లో 16 మందిని…