ఏనుగుల మంద వెలి వేసిందని… ఊరిమీద పడిన గజరాజు… రెండు నెలల్లో 16 మందిని…
తనతో సన్నిహితంగా ఉన్న సుమారు 22 ఏనుగులు తనను దూరం పెట్టి తమ మంద నుంచి వెలి వేసినందుకు ఆగ్రహించిన ఓ మగ ఏనుగు ఊరి మీద పడింది.
తనతో సన్నిహితంగా ఉన్న సుమారు 22 ఏనుగులు తనను దూరం పెట్టి తమ మంద నుంచి వెలి వేసినందుకు ఆగ్రహించిన ఓ మగ ఏనుగు ఊరి మీద పడింది. రెండు నెలల్లో 16 మందిని మట్టుబెట్టింది. ఝార్ఖండ్ లోని గిరిజన సంథాల్ పరగణాల ప్రాంతంలో సంచరిస్తున్న ఈ గజరాజు సమీప గ్రామవాసులను హడలెత్తిస్తోంది. 15 లేదా 16 ఏళ్ళ వయస్సు గలదిగా భావిస్తున్న ఈ ఏనుగు ప్రవర్తన చాలా ‘బ్యాడ్’ (ఘోరంగా) ఉండడంతో దాదాపు 22 ఏనుగులతో కూడిన మంద దీన్ని తమవద్దకు చేరనీయడం లేదని అటవీ అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఇది కోపంతో గ్రామాల మీద పడి అమాయక గ్రామీణుల ఉసురు తీస్తోందన్నారు. వారిని తొండంతో విసిరి కొట్టి చంపుతోందన్నారు. దీనిని అదుపులోకి తీసుకురావడానికి..దీని ‘బిహేవియర్’ మార్చడానికి 20 మంది అధికారుల బృందం ఎంతగా ప్రయత్నించినా వారి రాకను ముందే పసిగట్టినట్టు ఇది వేగంగా పరుగులు తీసి వారికి అందనంత దూరం వెళ్ళిపోతోందని ఓ సీనియర్ అధికారి చెప్పారు, గత మంగళవారం తనకు కనబడిన ఇద్దరు వృద్ధ జంటను ఈ గజరాజు దారుణంగా తొండంతో విసరి కొట్టడంతో వారు మృతి చెందారు.
అయితే తనకు మరీ దగ్గరగా వచినవారిపైనా, తనను రెచ్చగొట్టి ఫోటోలు తీసుకోవడానికి వచ్చిన వారిపైనా దాడి చేస్తోందని, అంతేగానీ ఇళ్లలో చొరబడడంలేదని ఆ అధికారి చెప్పారు. తనను మళ్ళీ ఆ మంద దగ్గరకు తీసుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. సామాన్యంగా ఏనుగులు మందలుగా తిరుగుతుంటాయి. అయితే ఏ ఏనుగు ప్రవర్తన అయినా నచ్చకపోతే దాన్ని తమ మంద నుంచి ‘బహిష్కరిస్తాయి’…. దాన్ని తమ దగ్గరకు రానివ్వవు అని ఆయన వివరించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణకై డిమాండ్ చేశాం… కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్
Tokyo Olympics: భారత మహిళా హాకీ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా రాణి రాంపాల్ ఎంపిక