బెంగాల్ లో బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి మూకుమ్మడి వలసలు, ‘శానిటైజర్ తో శుద్ధి చేసుకుని మరీ’ !
బెంగాల్ లో బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి మూకుమ్మడి వలసలు జోరందుకున్నాయి. వరస బెట్టి వివిధ జిల్లాల్లో కమలం పార్టీ కార్యకర్తలు పొలోమంటూ టీఎంసిలో చేరిపోతున్నారు.
బెంగాల్ లో బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి మూకుమ్మడి వలసలు జోరందుకున్నాయి. వరస బెట్టి వివిధ జిల్లాల్లో కమలం పార్టీ కార్యకర్తలు పొలోమంటూ టీఎంసిలో చేరిపోతున్నారు. బీర్ భమ్ జిల్లాలో గురువారం సుమారు 150 మంది కార్యకర్తలు ఈ పార్టీలో చేరారు. ఇలా చేరడానికి ముందు ‘బీజేపీ వైరస్’ నుంచి తమను తాము కాపాడుకుంటున్నామంటూ శానిటైజర్ తో ‘శుద్ధి’ చేయించుకున్నారు. మాలో బీజేపీ వైరస్ ఉందని, దాన్ని తొలగించుకోవాలంటే ఇలా శానిటైజర్ శుద్ధి అవసరమని కొందరు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో వీరిని ‘బీజేపీ బగ్’ నుంచి ప్రక్షాళన చేస్తున్నామని తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. ఈ శానిటైజేషన్ కార్యక్రమం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరికి నేతలు ‘టెస్టులు’ కూడా పెట్టడం విశేషం. పార్టీకి విధేయులుగా ఉంటామని వీరి చేత ప్రమాణం కూడా చేయించారట. హుగ్లీ జిల్లాలో కూడా ఈ నెల 22 న దాదాపు 200 మంది బీజేపీ కార్యకర్తలు శిరోముండనం చేయించుకుని.. గంగాజలంతో తమను తాము శుద్ధి చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. బీజేపీలో చేరి తాము పెద్ద తప్పు చేశామని, ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నామని వారు చెప్పారు. కాగా- బీజేపీ రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్ గుప్తా ఈ తీరుపై మండిపడుతున్నారు.
ఇది 1960 ప్రాంతం నాటి చైనా సాంస్కృతిక విప్లవాన్ని గుర్తుకు తెస్తోందన్నారు. నాడు రెడ్ గార్డుల వేధింపులు, పవిత్ర స్థలాల, ఆలయాల నాశనం వంటివి ఇప్పుడు మళ్ళీ చూస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. బెంగాల్ లో బీజేపీ కార్యకర్తలపై అలాంటి పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇటీవల సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ టీమ్ లోకి ముకుల్ రాయ్ తదితరులు కూడా చేరిన విషయం గమనార్హం.. ఈ సందర్భంగా ఆమె .. ఇంకా ఎక్కువమందికి స్వాగతం అని వ్యాఖ్యానించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఏనుగుల మంద వెలి వేసిందని… ఊరిమీద పడిన గజరాజు… రెండు నెలల్లో 16 మందిని…
జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణకై డిమాండ్ చేశాం… కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్