India Post Job: పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం.. టెన్త్ పాసైతే చాలు.. 30 వేలకుపైగా పోస్టులతో భారీ నోటిఫికేషన్..
India Post GDS Recruitment 2023 Notification: ఇండియా పోస్టల్‌లో ఉద్యోగం కోసం వెతుకుతున్న యువతకు ఒక సువర్ణావకాశం. ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ (India Post GDS Recruitment) ప్రారంభమైంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 23గా పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్, indiapostgdsonline.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

India Post GDS Recruitment 2023 Notification: పోస్టల్ శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే, మీకో సువర్ణావకాశం వచ్చింది. ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 30వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈమేరకు ఇండియా పోస్ట్ ఓ భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ (India Post GDS Recruitment) ప్రారంభమైంది. ఇందులో బ్రాంచ్ పోస్టు మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్/ డాక్‌సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 23గా పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్, indiapostgdsonline.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను ఆగస్టు 24 నుంచి ఆగస్టు 26 వరకు సవరించుకునే ఛాన్స్ ఉంది. ఇండియా పోస్ట్ GDS భారతి 2023 కింద, 30,041 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇండియా పోస్ట్ GDS 2023 కింద భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య: ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లక్ష్యం 30,041 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేయడం.




ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు ఎంత వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, వారి వయోపరిమితి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల చొప్పున వయసులో గరిష్ఠ సడలింపు ఇచ్చారు.
ఇండియా పోస్ట్ GDS కోసం విద్యా అర్హతలు?
బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM)/ డాక్‌సేవక్ పోస్టులను ఇందులో భర్తీ చేయనున్నారు. అయితే, ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. టెన్త్ క్లాస్‌లో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు చేయనున్నారు. ఇందులో గణితం, ఆంగ్లంతోపాటు స్థానిక భాష ఉండటం తప్పనిసరి అని పేర్కొన్నారు. అలాగే, అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం కూడా రావాల్సి ఉంటుంది.
జీతం?
ఉద్యోగాలను బట్టి బీపీఎంకు వేతన శ్రేణి రూ.12,000 -రూ.29,380లుగా పేర్కొన్నారు. అలాగే ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000-24,470లుగా నిర్ణయించారు.
దరఖాస్తు రుసుము?
అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా ₹ 100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మహిళలు/ట్రాన్స్-ఉమెన్ అభ్యర్థులు, SC/ST అభ్యర్థులందరికీ దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చారు.
దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని కెరీర్ & ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




