Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP RGUKT 2023: ట్రిపుల్‌ ఐటీల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ సెలెక్షన్‌ లిస్ట్‌ విడుదల.. పూర్తి జాబితా ఇదే

రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆధ్వర్యంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2023-29 విద్యాసంవత్సారానికి ఆరేళ్ల బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ నాలుగు క్యాంపస్‌లలో కలిపి మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. తాజాగా ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌ సెలక్షన్‌ జాబితా శుక్రవారం..

AP RGUKT 2023: ట్రిపుల్‌ ఐటీల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ సెలెక్షన్‌ లిస్ట్‌ విడుదల.. పూర్తి జాబితా ఇదే
AP RGUKT 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 04, 2023 | 8:37 PM

అమరావతి, ఆగస్టు 4: రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆధ్వర్యంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2023-29 విద్యాసంవత్సారానికి ఆరేళ్ల బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ నాలుగు క్యాంపస్‌లలో కలిపి మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. తాజాగా ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌ సెలక్షన్‌ జాబితా శుక్రవారం (ఆగస్టు 4) విడుదలైంది. మొత్తం సీట్లలో మొదటి విడతలో దాదాపు 38,355 మంది సీట్లు పొందారు. ఇంకా 829 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఈ నాలుగు క్యాంపస్‌లలో మిగిలి పోయిన 829 సీట్లకు ఆగస్టు 9, 10 తేదీల్లో నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

ఫేజ్- 2 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కాల్‌ లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రెండో జాబితాలో సీట్లు పొందిన విద్యార్ధులు ఆయా క్యాంపస్‌లలో సీట్లు పొందిన వారు ఆగస్టు 11న ఆయా క్యాంపస్‌ల్లో రిపోర్టు చేయాలని అడ్మిషన్ల కన్వీనర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు పేర్కొన్నారు. అలాగే మొదటి విడతలో సీట్లు పొందిన వారు క్యాంపస్‌ మార్పు చేసుకున్న వారి జాబితా కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆ విద్యార్ధులు కూడా గడువు తేదీలోగా స్వయంగా రిపోర్టు చేయాలన్నారు. అన్ని క్యాంపస్‌లలో ఆగస్టు 17 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. క్యాంపస్‌ల మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ఐటీఐ రెండో విడత కౌన్సెలింగ్‌

కృష్ణా జిల్లా ఐటీఐ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలకు రెండో విడత దరఖాస్తులు చేసుకున్న విద్యార్ధులకు శుక్రవారం (ఆగ‌స్టు 4) నుంచి కేబీఆర్‌ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో కౌన్సెలింగ్‌ జరిగింది. ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం 1 నుంచి 85 నంబర్ల వరకున్న వారికి ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూ జరిగింది. 86 నుంచి 147 నంబర్ల వరకు గల విద్యార్ధులు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంటర్వ్యూలకు హాజయ్యారు.

ఇవి కూడా చదవండి

ముగిసిన ఇంజినీరింగ్‌ ప్రత్యేక కేటగిరీ కౌన్సెలింగ్‌

విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో జరుగుతున్న ఇంజినీరింగ్‌ స్పెషల్‌ కేటగిరీ కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. చివరి రోజున దివ్యాంగులు, ఆంగ్లో ఇండియన్‌, భారత స్క్వౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగాలకు సంబంధించి మొత్తం 137 మంది హాజరయ్యారు. వీరిలో దివ్యాంగుల కేటగిరీలో 108 మంది, స్కాట్స్‌ అండ్‌ గైడ్స్‌ కేటగిరీలో 29 మంది హాజరైనట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల పిన్సిపల్‌ ఎం విజయసారథి తెలిపారు. ఆగస్టు 7నుంచి అప్షన్ల పెట్టుకోవాలన్నారు. ఆగస్టు 17న సీట్ల కేటాయించనున్నారు. ఆగస్టు 21వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆయన వివరించారు.

AP RGUKT 2023 ట్రిపుల్‌ ఐటీ రెండో విడత కౌన్సెలింగ్‌ సెలెక్షన్‌ లిస్ట్‌ కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.