India Post: విద్యార్థులకు సువర్ణవకాశం.. అంతర్జాతీయ లేఖల పోటీకి ఆహ్వానం.. ఏం చేయాలంటే..?
International Letter Writing Competition: అంతర్జాతీయ లేఖల పోటీకి యూనివర్సల్ పోస్టల్ రైటింగ్ యూనియన్ (UPU) పాఠశాల విద్యార్థులను ఆహ్వానిస్తోంది. విద్యార్థులు లేఖను వివరంగా, సమగ్రంగా రాయాల్సి

International Letter Writing Competition: అంతర్జాతీయ లేఖల పోటీకి యూనివర్సల్ పోస్టల్ రైటింగ్ యూనియన్ (UPU) పాఠశాల విద్యార్థులను ఆహ్వానిస్తోంది. విద్యార్థులు లేఖను వివరంగా, సమగ్రంగా రాయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ లేఖగా అవార్డు అందుకున్న వారిని అంతర్జాతీయ స్థాయి పోటీకి పంపుతారు. ఈ పోటీలో విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లను అందిస్తారు. ఈ పోటీలో బంగారు పతక విజేతకు స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఉన్న యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించే అవకాశముంటుంది. అక్కడ అన్ని ప్రదేశాలను చుట్టిరావొచ్చు.
లేఖ ఎలా రాయాలంటే..?
విద్యార్థులు యూనివర్సల్ పోస్టల్ రైటింగ్ యూనియన్ సూచించిన విధంగా లేఖను రాయాల్సి ఉంటుంది. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19తో తమ అనుభవం గురించి పోటీదారులు.. కుటుంబ సభ్యుడికి ఒక లేఖ రాయాల్సి ఉంటుంది. ఈ లేఖను 800 పదాల్లోనే రాయాలి. ఈ పోటీలో 15 సంవత్సరాల వయస్సు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చు. 15 ఏళ్లు పైబడిన వారి లేఖలను పరిగణలోకి తీసుకోరు. ఈ లేఖ సమర్పించడానికి చివరి తేదీ 2021 ఏప్రిల్ 5.
రెండు స్థాయిలల్లో పోటీ..
మొదటగా సర్కిల్ స్థాయిలో ఈ పోటీ రెండు స్థాయిల్లో జరగుతుంది. సర్కిల్ స్థాయికి మూడు బహుమతులు ఉంటాయి. మొదటి బహుమతి రూ .25 వేలు, సర్టిఫికేట్ రెండవ బహుమతి రూ .10,000, సర్టిఫికేట్ మూడవ బహుమతి రూ .5 వేలు, సర్టిఫికేట్
జాతీయ స్థాయిలో.. జాతీయ స్థాయిలో మొదటి విజేతకు రూ .50 వేలు, సర్టిఫికెట్ రన్నరప్‌కు రూ .25 వేలు, సర్టిఫికెట్ మూడో బహుమతి రూ .10,000, సర్టిఫికెట్ లభిస్తాయి.
పాల్గొనే విద్యార్థులు వారి పేరు, పుట్టిన తేదీ, జెండర్, తండ్రి లేదా సంరక్షకుడి పేరు, పాఠశాల పేరు, పూర్తి చిరునామా, పోస్టల్ అడ్రస్ వివరాలతో పాస్పోర్ట్ సైజు ఫోటోను జతచేసి లేఖను పంపాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రం, పాఠశాల ధృవీకరణ పత్రాన్ని అందించాల్సి ఉంటుంది. దీని గురించి సమీపంలోని పోస్ట్ ఆఫిస్‌లో కానీ.. చీఫ్ పోస్ట్ మాస్టర్, నోడల్ అధికారిని సంప్రదించవచ్చు.
Also Read: