- Telugu News Education Career Jobs Osmania university durgabai deshmukh mahila sabha invites for certificate courses for women
Certificate Courses For Women: హైదరాబాద్‌లో మహిళల కోసం ప్రత్యేక సర్టిఫికేట్ కోర్సులు.. మరో రెండు రోజులే గడువు..
Certificate Courses For Women: మహిళా సాధికారి కోసం దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళ సభ వివిధ సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 25 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Updated on: Mar 23, 2021 | 8:50 AM

మహిళా సాధికారత సాధించే క్రమంలో వారి కోసం ప్రత్యేకంగా కొన్ని సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఈ క్రమంలోనే దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) వివిధ సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వనిస్తోంది.

ఈ సర్టిఫికేట్ కోర్సులను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ లిటరసీ హౌజ్‌లో నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికేట్ కోర్సులైన యోగా, ఎంఎస్ ఆఫీస్-ఇంటర్నెట్ (ఆఫీస్ ఆటోమేషన్), ట్యాలీ - ఈఆర్‌పీ 9, బ్యుటీషియన్, ఇతర కోర్సులైన టైలరింగ్, జూట్ బ్యాగ్ మేకింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్ తదితర కోర్సులను అందించనున్నారు.

ఆసక్తి ఉన్నవారు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 9951210441, 040-27098406 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.





























