AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jobs In Hetro Drugs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. హెటిరో డ్రగ్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా..

Jobs In Hetro Drugs: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం 'ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రిక్రూట్‌మెంట్‌' (APSSDC) డ్రైవ్స్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా..

Jobs In Hetro Drugs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. హెటిరో డ్రగ్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా..
Jobs In Hetero
Narender Vaitla
|

Updated on: Mar 23, 2021 | 11:10 AM

Share

Jobs In Hetro Drugs: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం ‘ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రిక్రూట్‌మెంట్‌’ (APSSDC) డ్రైవ్స్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా హెటిరో డ్రగ్స్‌లో పలు ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 28న విజయనగరంలో ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, విశాఖపట్నంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ రిక్రూట్‌మెంట్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ భాగంగా మొత్తం 175 ఖాళీలను భర్తీ చేయనుండగా.. అందులో జూనియర్‌ కెమిస్ట్‌ (100), ట్రైనీ (30), జూనియర్‌ టెక్నీషియన్‌ (25), ట్రైనీ (25) పోస్టులను భర్తీ చేయనున్నారు.

పూర్తి వివరాలకు..

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 1800 4252 422 నెంబర్‌కు కాల్ చేయాలి.

ముఖ్యమైన విషయాలు..

* మార్చి 28 ఉదయం 10 గంటల నుంచి విజయనగరంలోని తోటపాలెం, ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ డిగ్రీ కాలేజీలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. * అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోగా రిపోర్ట్‌ చేయాలి. * జూనియర్‌ కెమిస్ట్‌ పోస్టుకు బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్‌, బీఏ ఉత్తీర్ణత సాధించాలి. * ట్రైనీ పోస్టుకు బీ ఫార్మసీ, ఎంఎస్సీ ఆర్గానిక్‌ అండ్‌ అనలిటికల్‌ కెమిస్ట్రీ ఉత్తీర్ణత. * జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుకు ఫిట్టర్‌ ట్రేడ్‌లో ఐటీఐ పాస్‌ కావాలి. * ట్రైనీ పోస్టుకు బీఎస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణులై ఉండాలి. * ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. * ఎంపికైన అభ్యర్థులకు రూ.రూ.10,000 నుంచి రూ.16,000ల వేతనంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, క్యాంటీన్ ఫెసిలిటీ, ప్రతీ ఏటా ఇంక్రిమెంట్, బోనస్ లాంటి ప్రయోజనాలు ఉంటాయి. * ఉద్యోగాలకు అర్హత సాధించిన వారు హైదరాబాద్, విశాఖపట్నంలోని హెటిరో యూనిట్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేసిన ట్వీట్‌..

Also Read: India Post: విద్యార్థులకు సువర్ణవకాశం.. అంతర్జాతీయ లేఖల పోటీకి ఆహ్వానం.. ఏం చేయాలంటే..?

Certificate Courses For Women: హైదరాబాద్‌లో మహిళల కోసం ప్రత్యేక సర్టిఫికేట్‌ కోర్సులు.. మరో రెండు రోజులే గడువు..

Sainik School Job Notification 2021 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ తరగతి అర్హతతో సైనిక్ స్కూల్ లో ఉద్యోగావకాశాలు