NEET 2021 Exam Pattern: నీట్ పరీక్షపై వస్తోన్న వార్తలన్నీ పుకార్లే.. వాటిని నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన..
NEET 2021 Exam Pattern: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సమాచార మార్పిడి చాలా వేగంగా జరుగుతోంది. ఏ చిన్న విషయమైనా వెంటనే వైరల్‌గా మారుతోంది. అయితే...
NEET 2021 Exam Pattern: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సమాచార మార్పిడి చాలా వేగంగా జరుగుతోంది. ఏ చిన్న విషయమైనా వెంటనే వైరల్‌గా మారుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో అబద్దం అంతకంటే ఎక్కువ ఉంటున్నాయి. సమాచారం పేరిట అసత్య ప్రచారాలు కూడా నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా నీట్ 2021 పరీక్షల విషయంలో కూడా ఇలాంటి ఓ వార్తే నెట్టింట తెగ వైరల్‌గా మారింది. నీట్ 2021 పరీక్ష పేపర్ సరళి ఇదేనంటూ ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వేదికగా వార్త చక్కర్లు కొట్టింది. దీంతో చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్ష విధానం మారిందా.? అంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతోన్న ఈ ప్రచారం గురించి స్పందించిన ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ వార్తలు పూర్తిగా నిరాధారమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ‘పీఐబీ ఫ్యాక్ట్ చెక్’ ఓ పోస్ట్ చేసింది. గత కొన్ని రోజులుగా నీట్ పరీక్షపై జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చెబుతూ.. ఆ వార్తలు పూర్తిగా ఫేక్ అని తేల్చి చెప్పింది. ‘నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ’ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టతనిచ్చింది. ఇక పూర్తి వివరాల కోసం ‘నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ’ అధికారిక వెబ్‌సైట్ https://nta.ac.inలో చూడాలని తెలిపింది.
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసిన ట్వీట్..
Several posts claiming that @DG_NTA has released the exam pattern of #NEET2021 are doing the rounds on social media#PIBFactCheck: This exam pattern is #Fake & not released by NTA.
For updates, visit the NTA’s official website: https://t.co/rUhCOSavc2 pic.twitter.com/zLz8Aw7CcF
— PIB Fact Check (@PIBFactCheck) March 22, 2021
Also Read: Jobs In Hetro Drugs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెటిరో డ్రగ్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా..