AP Schools: ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిపూట బడులు.. కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర విద్యాశాఖ..
Half Day Schools In AP: తగ్గుముఖం పడుతోందని అంతా అనుకుంటోన్న సమయంలో కరోనా మహమ్మారి మళ్లీ తన పంజాను విసురుతోంది. కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో చాలా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పాఠశాలలు...
Half Day Schools In AP: తగ్గుముఖం పడుతోందని అంతా అనుకుంటోన్న సమయంలో కరోనా మహమ్మారి మళ్లీ తన పంజాను విసురుతోంది. కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో చాలా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పాఠశాలలు తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పాఠశాలల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీని నుంచి 1 నుంచి పదో తరగతి వ్యిద్యార్థులకు ఒక్కపూటే తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఉదయం 7.45 నిమిషాలకు పాఠశాలలు ప్రారంభం అవనుండగా మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాఠశాలల నంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకునేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. మార్చిలోనే ఎండలు మండిపోతుండడం, కరోనా కేసులు కూడా బాగా పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Also Read: జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!