Corona Effect on Temples: ఆలయాలపై కరోనా ఎఫెక్ట్.. ఇక అన్నదానం బదులు ఫుడ్‌ప్యాకెట్స్
Corona Effect on Temples: దేశవ్యాప్తంగా శరవేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య 67 శాతం పెరిగింది. ఆదివారం ఒక్క రోజే..
దేశవ్యాప్తంగా శరవేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య 67 శాతం పెరిగింది. ఆదివారం ఒక్క రోజే 47,047 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయంటేనే వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు తెలుగు రాష్ట్రాలపై కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. తగ్గినట్టే తగ్గిన మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో మరింత బలంగా వ్యాపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 337 కరోనా కేసులు… మూడు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,455. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1671గా ఉంది. అటు ఏపీలోనూ రోజుకు వందల కేసులు నమోదతువున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో నేటి నుంచి అన్నదానం కార్యక్రమాన్ని నిలిపివేశారు. అన్న ప్రసాదానికి బదులుగా భక్తులకు ఫుడ్ ప్యాకెట్స్‌ను అందించనున్నారు. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం 54,819 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 25,996 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అటు శ్రీశైలం మల్లన్న ఆలయం నిత్యా అన్నదానానికి కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా కారణంగా నిత్యాన్నదానం తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు స్వామి, అమ్మవార్ల దర్శనంతరం ప్యాకెట్ల రూపంలో భక్తులకు అన్నప్రసాదం అందజేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి..ప్రజలందరూ వ్యాక్సినేషన్ కు సిద్ధంగా ఉండాలి..వ్యాక్సిన్ పై అపోహలు వీడాలని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కోరుతున్నారు.
Read More:
CM KCR ON PRC: తెలంగాణ ఉద్యోగులకు వరాలు.. శాసనసభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
TS MLC Corona: ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు కరోనా పాజిటివ్.. బడ్జెట్ సమావేశాలు కుదించే అవకాశం