Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS MLC Corona: ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు కరోనా పాజిటివ్‌.. బడ్జెట్‌ సమావేశాలు కుదించే అవకాశం

TS MLC Corona: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలపై కరోనా ఎఫెక్ట్‌ పడే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది...

TS MLC Corona: ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు కరోనా పాజిటివ్‌.. బడ్జెట్‌ సమావేశాలు కుదించే అవకాశం
Mlc Puranam Sathish
Follow us
K Sammaiah

|

Updated on: Mar 22, 2021 | 12:46 PM

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలపై కరోనా ఎఫెక్ట్‌ పడే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ ఎఫెక్ట్ తెలంగాణ అసెంబ్లీని సైతం తాకింది. అసెంబ్లీ సమావేశాలను షెడ్యూల్‌కు ముందే ముగించే యోచనలో ప్రభుత్వం ఉంది. రేపు లేదా ఎల్లుండి బడ్జెట్ సెషన్స్ క్లోజ్ అవనున్నాయి.

అయితే షెడ్యూల్ ప్రకారం ఈనెల 26 వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. బీఏసీ సమావేశం పెట్టి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించనుంది. ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు కరోనా సోకింది. ఈ విషయం ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలియజేశారు. పార్టీశ్రేణులకు,కార్యకర్తలకు,ప్రజలకు,నాయకులకు మనవి. నాకు రాపిడ్ టెస్ట్ లో నెగటివ్ రాగా, RTPCR టెస్టులో కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత ఐదు రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు కోవిడ్ పరిక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను అని సతీష్‌ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాలను కుదించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రోజురోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అటువైపుగా ఆలోచన చేస్తోంది. గత కొన్నిరోజులుగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో అసెంబ్లీ సమావేశాల్ని షెడ్యూల్‌ ముందే ముగించాలని భావిస్తోంది. దీనిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

కోవిడ్ ఎఫెక్ట్ కాస్త తెలంగాణ అసెంబ్లీని సైతం తాకడంతో సమావేశాలను షెడ్యూల్‌కు ముందే ముగించే యోచనలో ప్రభుత్వం ఉంది. రేపు లేదా ఎల్లుండి బడ్జెట్ సెషన్స్ ముగియనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 26 వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు ఇవాల్టి సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలు తర్వాత సీఎం సభలో పీఆర్సీకి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

Read More:

Telangana Budget: Good News 57 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్‌.. అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి

World Water Day 2021: నీటి పొదుపుపై స్ఫూర్తిదాయక ట్వీట్‌ చేసిన స్మితా సబర్వాల్