JNTU Hyderabad: హైదరాబాద్ జేఎన్‌టీయూలో తిరిగి మొదలైన తరగతులు.. హాస్టళ్లలో ఉండడానికి అంగీకారం తప్పనిసరి..
JNTU Hyderabad: కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితమైన రంగాల్లో విద్యా రంగం ఒకటి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభానికి గురైంది. లాక్‌డౌన్ విధించడంతో చేసేదేమిలేక చాలా..
JNTU Hyderabad: కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితమైన రంగాల్లో విద్యా రంగం ఒకటి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభానికి గురైంది. లాక్‌డౌన్ విధించడంతో చేసేదేమిలేక చాలా సంస్థలు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో క్లాస్‌లు వినే విధానాన్ని తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే జేఎన్‌టీయూ హైదరాబాద్ కూడా కాలేజీనీ మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. వేల సంఖ్యలో ఉన్న స్టూడెంట్స్‌ను హాస్టల్ నుంచి పంపించేశారు. ఇదిలా ఉంటే తాజాగా జేఎన్‌టీయూ హైదరాబాద్ తరగతులను తిరిగి ప్రారంభించిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఫస్ట్ ఇయర్, ఫైనల్ ఇయర్‌తో పాటు పీజీ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తూ ప్రకటన చేశారు. నేటి (సోమవారం) నుంచి తరగతులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్‌కు సంబంధించి విద్యార్థులకు మార్చి 22 నుంచి ఏప్రిల్ 30 వరకు తరగతులు నిర్వహించనున్నట్లు జేఎన్‌టీయూ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే సెకండ్ ఇయర్, థార్డ్ ఇయర్ విద్యార్థులకు ఇంతకు ముందులాగే ఆన్‌లైన్ విధానమే కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇక వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల కోసం హాస్టల్ గదులను కూడా తిరిగి ప్రారంభించనున్నారు. అయితే ఇందుకోసం పూర్తిగా కోవిడ్ నిబంధనలను పాటించనున్నారు. ఇదిలా ఉంటే హాస్టళ్లలో ఉండాలనుకునే విద్యార్థులు తప్పసిసరిగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌పై సంతకం చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా తిరిగి తరగతులకు హాజరుకావాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా తాజాగా తీసుకున్న ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్ట్‌ను (కరోనా నిర్ధారణ పరీక్ష) వెంట తెచ్చుకోవాలని అధికారులు విద్యార్థులకు సూచించారు.