రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హోలీ సందర్భంగా 4 స్పెషల్ ట్రైన్స్.. సికింద్రాబాద్ నుంచి ఎక్కడెక్కడికంటే..
Four Holi Special Trains : హోలీ పండుగ సందర్భంగా రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకొని
Four Holi Special Trains : హోలీ పండుగ సందర్భంగా రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు గమనించి వారి వారి స్థానాలకు సురక్షితంగా వెళ్లాలని సూచించింది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ మరియు గోరఖ్పూర్ మరియు హైదరాబాద్ మరియు రక్సువల్ మధ్య నాలుగు పండుగ ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. కాగా ప్రయాణికులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్ని కూడా రిజర్వ్ చేయబడిన సేవలుగా గుర్తించాలి.
1. ట్రైన్ నెంబర్ 07003 రాత్రి 09.25 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 06.25 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. 2. ట్రైన్ నెంబర్ 07004 సాయంత్రం 5.25 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. 3. ట్రైన్ నెంబర్ 07040 హైదరాబాద్ నుంచి రాత్రి 9.40 గంటలకు బయలుదేరి రాత్రి 04.50 గంటలకు రాక్సాల్ చేరుకుంటుంది. 4. రైలు నెంబర్ 07039 రాక్సాల్ నుంచి ఉదయం 03.25 గంటలకు బయలుదేరి రాత్రి 22.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.