Telangana Assembly Sessions Live Updates: ఉద్యోగులపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌.. 30 శాతం ఫిట్‌మెంట్‌..

Narender Vaitla

|

Updated on: Mar 22, 2021 | 1:30 PM

Telangana Assembly 2021 Live: తెలంగాణ ఉద్యోగులపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వరాల జల్లు కురిపించారు. బడ్జెట్‌ సమావేశాల్లో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు చెప్పారు. ఎంతో కాలంగా ఎందురు చూస్తున్న..

Telangana Assembly Sessions Live Updates: ఉద్యోగులపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌.. 30 శాతం ఫిట్‌మెంట్‌..
Telangana Assembly Live Cm Kcr

Telangana Assembly 2021 Live: తెలంగాణ ఉద్యోగులపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వరాల జల్లు కురిపించారు. బడ్జెట్‌ సమావేశాల్లో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు చెప్పారు. ఎంతో కాలంగా ఎందురు చూస్తున్న పీఆర్సీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అంతే కాకుండా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వేతనాలు పెంపు వర్తిస్తుందని చెప్పారు. మొత్తం తొమ్మిది లక్షల 17 వేల మందికి వేతనాల పెంపు వర్తిస్తుందని తెలిపారు. త్వరలోనే ఉద్యోగులకు ప్రమోషన్లు , బదిలీల ప్రక్రియ ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇక ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. 12 నెలల ఎరియర్స్ కలిపి prc ఫిట్మెంట్ చెల్లించనున్నట్లు తెలిపారు. వీఆర్ఏలు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీలకూ పీఆర్సీ వర్తిస్తుందని సీఎం చెప్పారు. టీచర్ల అంతర్ జిల్లాల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Mar 2021 12:56 PM (IST)

    ఉద్యోగులపై కేసీఆర్‌ వరాల జల్లు..

    * ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ కొత్త విధానాల అధ్యయానికి కమిటీ ఏర్పాటు. * 15 శాతం అదనపు పెన్షన్‌. 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు తగ్గింపు.

    Kcr About Prc

    Kcr About Prc

    Kcr Prc 2

    Kcr Prc 2

  • 22 Mar 2021 12:47 PM (IST)

    ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ బంపర్‌ ఆఫర్స్‌..

    * మహిళా ఉద్యోగులకు 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలువు. * భార్యభర్తుల ఒకే జిల్లాలో ఉండేలా అంతర్‌జిల్లా బదిలీలు. * 12 నెలలు పీఆర్సీ బకాయిలు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లో చెల్లింపు. * అర్హులైన ఉద్యోగులందరికీ త్వరలోనే ప్రమోషన్లు. * వీఆర్‌ఏ, ఆశావర్కర్లు అంగన్‌వాడీలకూ పెరిగిన పీఆర్‌సీ వర్తింపు. * వీరితో పాటు హోంగార్డులు, ఔట్‌సోర్సింగ్‌, డైలీవేజ్‌ వర్కర్లకు కూడా వర్తింపు చేస్తూ ప్రకటన.

  • 22 Mar 2021 12:40 PM (IST)

    పీఆర్‌సీ ఫిట్మెంట్‌ 30 శాతం.. జరిగిన ప్రచారం కంటే 1 శాతం ఎక్కువే..

    * ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వేతనాలు పెంపు * తొమ్మిది లక్షల 17 వేల మందికి వేతనాల పెంపు * త్వరలో ప్రమోషన్లు , బదిలీలు * PRC ఫిట్మెంట్ 30 శాతం. ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన పీఆర్‌సీ అమలు. * 12 నెలల ఎరియర్స్ కలిపి prc ఫిట్మెంట్

  • 22 Mar 2021 12:37 PM (IST)

    ఉద్యోగులపై కేసీఆర్‌ వరాల జల్లు..

    * అన్ని రకాల, అన్ని స్థాయిల ఉద్యోగలకు వేతన పెంపు. * అర్హులైన ఉద్యోగులందరికీ త్వరలోనే ప్రమోషన్లు. * 9 లక్షల 17 వేల 797 మందికి వేతన పెంపు. * తెలంగాణలో ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్లకు పెంపు.

  • 22 Mar 2021 12:33 PM (IST)

    ఆర్థిక మాంద్యం కారణంగా పీఆర్‌సీ ఆలస్యమైంది: సీఎం కేసీఆర్‌

    పీఆర్‌సీపై అసెంబ్లీలో ప్రసంగిస్తోన్న సీఎం కేసీఆర్‌ ఆర్థిక మాంద్యం కారణంగానే పీఆర్‌సీ ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉద్యోగ సంఘాలతో పలుదఫాలుగా చర్చలు జరిగాయి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరవలేనిది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పేరు మార్చుకోని ఏకైక సంఘం టీఎన్జీవో’ అని చెప్పుకొచ్చారు.

  • 22 Mar 2021 12:27 PM (IST)

    మొదలైన కేసీఆర్‌ ప్రసంగం…

    అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న కేసీఆర్‌ ప్రసంగం కాసేపటి క్రితమే మొదలైంది. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘కరోనాతో వేతన సవరణలో ఆలస్యం జరిగింది. ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీని ప్రకటిస్తున్నాం. పీఆర్సీపై త్రిసభ్య కమిటీ అన్ని సంఘాలతో చర్చించింది’ అని చెప్పుకొచ్చారు.

  • 22 Mar 2021 11:51 AM (IST)

    రాష్ట్రంలో సౌరవిద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి జగదీశ్‌రెడ్డి

    శాస‌న‌స‌భ‌లో ప్రశ్నోత్తరాల సంద‌ర్భంగా సాంప్రదాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల‌పై స‌భ్యులు అడిగిన ప్రశ్నల‌కు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టంలో సౌర‌విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. 2017 -18 నాటికి 3,600 మెగావాట్లు, 2018-19 నాటికి 3,894 మెగావాట్లు, 2019-20 నాటికి 3,943 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు మంత్రి ప్రక‌టించారు. సాంప్రదాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల‌ను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.

  • 22 Mar 2021 10:35 AM (IST)

    కేసీఆర్‌ చేయనున్న ప్రకటనలు ఇవేనా..?

    అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారన్న నేపథ్యంలో అందరిలో ఆసక్తినెలకొంది. ఈ క్రమంలోనే సీఎం చేసే ప్రకటనలు ఇవేనని తెలుస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయాలేంటంటే.. * ఉద్యోగులపై సీఎం కేసీఆర్‌ వరాలు కురిపించే అవకాశాలున్నాయి. * పీఆర్సీ 29 లేదా 30 శాతంగా ఖరారు చేసే అవకాశం. * బదిలీలు, కొత్త నోటిఫికేషన్లపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్‌. * ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచే నిర్ణయంపై స్పష్టతనిచ్చే అవకాశం. * కరోనా విజృంభిస్తోన్న వేళ పాఠశాలలను తిరిగి మూసివేసే నిర్ణయం.

  • 22 Mar 2021 10:31 AM (IST)

    పీఆర్‌సీ ఎంత..?

    నేడు జరగుతోన్న అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగులకు తీపి కబురు అందనుందన్న వార్తల మేరకు… పీఆర్సీ 29 లేదా 30 శాతంగా ఖరారు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు బదిలీలు, కొత్త నోటిఫికేషన్‌పై సీఎం కేసీర్‌ క్లారిటీ ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

  • 22 Mar 2021 10:26 AM (IST)

    పీఆర్‌సీ ప్రకటనకు రంగం సిద్ధం..

    రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లంతా ఎదురుచూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటనకు రంగం సిద్ధమైంది. రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ వేదికగా పీఆర్సీ, రిటైర్మెంట్‌ వయసు పెంపుపై ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్‌ ఈనెల 17న శాసనసభలో చెప్పిన విషయం తెలిసిందే. దీనికి ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Published On - Mar 22,2021 1:20 PM

Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?