Exercise During Pregnancy : గర్భధారణ సమయంలో వ్యాయామం వల్ల పిల్లల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..?

గర్భధారణ సమయంలో చేసే వ్యాయామం మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు.. గర్భంలో ఉన్న పిల్లలకు కూడా ఎంతో మంచిదట.. గర్భిణీ స్త్రీ వ్యాయామం చేయడం వల్ల  వారి సంతానానికి మధుమేహం..

Exercise During Pregnancy : గర్భధారణ సమయంలో వ్యాయామం వల్ల పిల్లల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..?
Exercise During Pregnancy
Follow us
Surya Kala

|

Updated on: Mar 22, 2021 | 1:19 PM

Exercise During Pregnancy :  గర్భధారణ సమయంలో చేసే వ్యాయామం మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు.. గర్భంలో ఉన్న పిల్లలకు కూడా ఎంతో మంచిదట.. గర్భిణీ స్త్రీ వ్యాయామం చేయడం వల్ల  వారి సంతానానికి మధుమేహం మరియు ఇతర జీవక్రియ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని  కొత్త పరిశోధనలు  ద్వారా తెలుస్తోంది. ఇటీవలే ఓ ల్యాబ్ లో ఎలుకలపై చేసిన ఒక అధ్యయనంలో గర్భధారణ సమయంలో తల్లి కి లేదా తండ్రికి ఊబకాయం, జీవ సంబంధిత వ్యాధులుంటే ఆ లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని గర్భధారణ సమయంలో చేసే వ్యాయామం నిరోధించిందని తెలిసింది. ఈ విషయం కనుక మానవుల్లో కూడా నిజమైతే.. గర్భిణీ స్త్రీలు తమ పిల్లలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్దపడాల్సి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అంటే.. భవిష్యత్ లో తల్లి కాబోతున్న మహిళ వైద్యుల వద్దకు వెళ్ళితే.. వైద్యులు వ్యాయామం చేయమని సూచించడమే కాదు.. ఒక ప్రిస్క్రిప్షన్ కూడా రాయవచ్చు అని అంటున్నారు. ఈ రోజు మనిషి ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో ఎక్కువగా పిండ దశ నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. గర్భధారణ సమయంలో తల్లిఆరోగ్య పరిస్థితి పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని.. వర్జీనియా యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయంలోని వ్యాయామ నిపుణుడు పిహెచ్‌డి పరిశోధకుడు జెన్ యాన్ అన్నారు.

గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో ఊబకాయం ఉన్న తల్లి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. మధుమేహం నుంచి పిల్లలు రక్షింపబడతారని ఎలుక మీద చేసిన ప్రయోగం ద్వారా తెలిసిందని చెప్పారు. తల్లికి ఊబకాయం ఉంటె.. గర్భస్థ సమయంలో చేసే వ్యాయామం పిల్లను మధుమేహం నుంచి కాపాడుతుందని తమ అధ్యయనాల్లో తేలిందని చెప్పారు.. అయితే తండ్రికి ఊబకాయం అంటే అనే ప్రశ్న కు సమాధానం కూడా చెప్పారు. గర్భధారణ సమయంలో చేసే వ్యాయామం ఆరోగ్యకరమైన శిశువు జన్మిస్తుందని.. గర్భధారణ సమస్యలు మరియు అకాల ప్రసవాల ప్రమాదాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఇదే విషయం పై కండరాల పరిశోధన డైరెక్టర్ యాన్ మాట్లాడుతూ.. గర్భిణీ చేసే వ్యాయామం తో పిల్లల జీవితమంతా ఆరోగ్యంగా ఉంటారా.. మధుమేహం, జీర్ణ సంబంధిత వ్యాధుల నుంచి రక్షింపబడతారా తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఈ మేరకు ఎలుకపై ప్రయోగాలు చేస్తున్నామని తెలిపారు.

వాస్తవానికి, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలలను, అలాగే శిశువు యొక్క హృదయ స్పందనను అనుభవిస్తారు. గర్భం అనేది ఒక అసాధారణమైన సమయం, దీనిలో శరీర వ్యవస్థలన్నీ తల్లి మరియు బిడ్డల మధ్య సంబంధాన్ని పెంపొందించుకుంటాయి.]

Also Read: వచ్చే నాలుగేళ్లలో అన్ని కంపెనీలలో ఉద్యోగులు రోబోలే.. మర మనుషుల వైపు మళ్లుతున్న కంపెనీలు..

అక్రమంగా మద్యం తరలించడానికి ట్రక్ డిజైన్ మార్చిన స్మగ్లర్స్.. ఆనంద్ మహీంద్రా షాక్