Pimples clear tips: చాలామంది యువతులను మొటిమల సమస్య బాగా వేధిస్తుంటుంది. కొంతమంది ఈ సమస్యను తొలగించుకోవడానికి ఎవేవో ఫేస్ ప్యాక్‌లు, క్రీం లు వాడి చర్మ సహజతత్వాన్ని పొగుట్టుకుంటుంటారు. అలాంటి వారు ఇంట్లోనే సాధారణ పద్దతులతోనే మొటిమలను తగ్గించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
1 / 6
టీనేజ్ వయసులో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరగి మొటిమలు వాటంతటవే తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ తగ్గకపోతే.. ఇలాంటి చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు.
2 / 6
కలబందలో ఎన్నో ఉపయోగకరమైన ఔషధ గుణాలున్నాయి. దీనిని ఫేషియల్‌గా ఉపయోగిస్తే ఎన్నో ఫలితాలుంటాయి. కలబంద గుజ్జులో కొంచెం కస్తూరి పసుపు వేసి బాగా కలపి ముఖానికి అద్దుకోవాలి. ఇలాచేస్తే మొటిమల సమస్య తగ్గుతుంది. ఒకవేళ కలబంద గుజ్జురాసినా సరిపోతుంది.
3 / 6
సాధరణంగా ముల్తానీ మట్టి, శనగపిండి కూడా మొటిమలు తగ్గేందుకు ఉపయోగపడతాయని సౌందర్య నిపుణులు పేర్కొంటున్నారు. వాటి ద్వారా చర్మం కూడా కాంతి వంతంగా మారుతుందని.. మొటిమల సమస్యకూడా పోతుందని పేర్కొంటున్నారు.
4 / 6
సముద్రపు ఉప్పు ద్వారా మొటిమలని తగ్గించుకోవచ్చు. కొంచెం సీ సాల్ట్‌లో తేనె, నిమ్మరసం కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రుద్దుకోవాలి. మొటిమలు ఉన్న స్థానంలో బాగా మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు.
5 / 6
అయితే.. ఇలాంటివి జాగ్రత్త చర్యలు పాటించనప్పటికీ.. మొటిమల సమస్య బాగా వేధిస్తుంటే.. వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంటున్నారు.