Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lungs clean: మీ ఊపిరితిత్తులను ఇలా సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చు.. లేకపోతే అనర్థాలే..

Clean Your Lungs naturally: అసలే కరోనా కాలం.. ఆపై కాలుష్యం ముప్పు. ఇవన్నీ మనిషిని అనారోగ్యం బారిన పడేలా చేస్తున్నాయి. వాస్తవానికి గాలి ద్వారా సోకే వైరస్‌లే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో

Lungs clean: మీ ఊపిరితిత్తులను ఇలా సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చు.. లేకపోతే అనర్థాలే..
Health Tips for Lungs: ఓవైపు దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు శక్తివంతమైన ఊపిరితిత్తులు ఉండటం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితిలో, మీరు ఊపిరితిత్తులకు హాని కలిగించే పదార్థాలను తీసుకోవడం మానేస్తేనే మంచిదంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 22, 2021 | 4:28 AM

Clean Your Lungs naturally: అసలే కరోనా కాలం.. ఆపై కాలుష్యం ముప్పు. ఇవన్నీ మనిషిని అనారోగ్యం బారిన పడేలా చేస్తున్నాయి. వాస్తవానికి గాలి ద్వారా సోకే వైరస్‌లే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఊపిరితిత్తులు మన ఆరోగ్యానికి ఆయుపట్టులా పనిచేస్తాయి. అలాంటి ముఖ్యమైన ఊపిరితిత్తులను సాధారణ పద్దతుల్లో ఎలా శుభ్రం చేసుకోవాలో మీకు తెలుసా..? ఒకవేళ తెలియకపోతే ఈ చిట్కాలు పాటిస్తే చాలు ఇట్టే శుభ్రమవుతాయంటున్నారు నిపుణులు. లేకపోతే రోగాల బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే మనం సాధారణంగా ఇంట్లోనే లంగ్స్‌ను క్లీన్ చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఇలా ఊపిరిత్తులను శుభ్రం చేసుకోవచ్చు..

● ఉదయాన్నే పరిగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో ఉండే వ్యర్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు కూడా శుభ్రమవుతాయని సూచిస్తున్నారు.

● పరిగడుపునే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల అల్లం రసం.. లేదా అల్లంను నీటిలో బాగా మరిగించి ఒక గ్లాసు నీటిని తాగినా ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.

● ఉదయాన్నే కొన్ని పుదీనా ఆకులను తిన్నా.. లేకపోతే.. జ్యూస్ చేసుకోని తాగినా ఊపిరితిత్తులకు బలం చేకూరుతుంది. శుభ్రమవుతాయి.

● గోరు వెచ్చని నీటిలో 5 నుంచి 10 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరిని పీలిస్తే ఊపిరితిత్తుల్లో ఉండే మలినాలన్నీ బయటకు వెళ్లిపోయి శుభ్రపడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

● గ్రీన్ టీ, పుదీనా టీ తాగినా ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయని పేర్కొంటున్నారు. ఇవి శరీరంతోపాటు, లంగ్స్‌లోని మలినాలను బయటకు పంపుతాయి.

● వ్యాయామం, ప్రాణాయామం చేయడం వల్ల మీ లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. దీనివల్ల శ్వాస సంబంధిత సమస్యలు తొలిగిపోయి శుభ్రపడుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

● తేనె యాంటీ బాక్టీరియల్‌గా ఆరోగ్యాన్ని కాపాడుతుందన్న విషయం తెలిసిందే. వేడి నీటిలో కొంచెం తెనే వేసుకోని తాగితే శ్వాసకోశ సమస్యలు తగ్గి.. లంగ్స్ శుభ్రపడతాయి.

● ప్రతీరోజూ ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే ఆరోగ్యవంతంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంతోపాటు.. లంగ్స్‌ను శక్తివంతంగా మారుస్తాయి.

Also Read:

Tears of Blood: బహిష్టు సమయంలో ఆ మహిళ కంట రక్తం.. ఆశ్యర్యపోయిన వైద్యులు.. ఎక్కడో తెలుసా..?