COVID-19: వ్యాక్సిన్ తీసుకుంటే.. అప్పటివరకూ రక్తదానం చేయొద్దు: ఎన్‌బీటీసీ ఆదేశాలు

Blood Donation: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా కొనసాగుతోంది. పలు విషయాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రక్తదానం చేసే విషయంలో నేషనల్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌బీటీసీ)

COVID-19: వ్యాక్సిన్ తీసుకుంటే.. అప్పటివరకూ రక్తదానం చేయొద్దు: ఎన్‌బీటీసీ ఆదేశాలు
Blood donation
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 22, 2021 | 10:10 AM

Blood Donation – COVID-19 vaccine: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా కొనసాగుతోంది. పలు విషయాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రక్తదానం చేసే విషయంలో నేషనల్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌బీటీసీ) కీలక సూచనలు చేసింది. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత 28 రోజుల వరకు రక్తదానం చేయొద్దంటూ ఎన్‌బీటీసీ సూచనలు చేసింది. గతనెల 17న జరిగిన ఎన్‌బీటీసీ పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ సునీల్‌ గుప్తా పేర్కొన్నారు. దీనికి సంబంధించి నేషనల్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూషన్‌ కౌన్సిల్‌ ఇటీవల ఉత్తర్వులు సైతం జారీ చేసిందని వెల్లడించారు.

కరోనా బారి నుంచి రక్షించుకోవడానికి తీసుకునే వ్యాక్సిన్ ఏదైనప్పటికీ.. రెండో డోసు తర్వాత 28 రోజుల వరకు రక్తదానానికి ఆగాల్సిందేనని ఎన్‌బీటీసీ వెల్లడించింది. అంటే తొలి డోసు తీసుకున్న అనంతరం 56 రోజులపాటు (రెండు నెలలపాటు) రక్తదానం చేయొద్దని సూచించింది.

వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాతే శరీరంలో కోవిడ్ వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే టీకా తీసుకున్న అనంతరం మద్యపానానికి దూరంగా ఉండాలా అనే విషయంలో ఏర్పడిన సందేహాన్ని సైతం ఆరోగ్యశాఖ ఇటీవల నివృత్తి చేసింది. మద్యపానం వల్ల టీకా ప్రభావశీలత తగ్గిందనడానికి ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లభించలేదని స్పష్టంచేసింది.

Also Read:

ICAI CA Final Result Jan 2021: సీఏ ఫైనల్, ఫౌండేషన్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌గా ఇలా చెక్ చేసుకోండి

COVID-19 vaccine: భారత్ ఆపన్నహస్తం.. 76 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: కేంద్రమంత్రి హర్షవర్ధన్