Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బోర్డర్ ఈజ్ క్లోజ్డ్’, అమెరికాలో ఎంటరవుతున్న శరణార్థులకిక నో ఎంట్రీ, వెల్లువలా వస్తున్నారు మరి !

తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న శరణార్థులను ఆదుకుంటామని,  మానవతా దృక్పథంతో వారికి షెల్టర్ కల్పిస్తామని అధ్యక్షుడు జోబైడెన్ ఇచ్చిన హామీ నీళ్లపాలయ్యేట్టే కనిపిస్తోంది. ప్రతి రోజూ వందలు, వేల సంఖ్యలో...

'బోర్డర్ ఈజ్ క్లోజ్డ్', అమెరికాలో ఎంటరవుతున్న శరణార్థులకిక నో ఎంట్రీ, వెల్లువలా వస్తున్నారు మరి !
Joebiden Pushes Back Migrant Crisis
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 22, 2021 | 12:48 PM

తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న శరణార్థులను ఆదుకుంటామని,  మానవతా దృక్పథంతో వారికి షెల్టర్ కల్పిస్తామని అధ్యక్షుడు జోబైడెన్ ఇచ్చిన హామీ నీళ్లపాలయ్యేట్టే కనిపిస్తోంది. ప్రతి రోజూ వందలు, వేల సంఖ్యలో వస్తున్న వీరికి ఎలా అడ్డుకట్ట వేయాలో, ఎలా వీరిని నియంత్రిచాలో తెలియక అమెరికా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇది అమెరికాలోకి ప్రవేశించే సమయం కాదని, దయచేసి రాకూడదని, జర్నీ చాలా ప్రమాదకరమని సరిహద్దుల్లో తాము బోర్డులు కూడా పెట్టినట్టు  హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ తెలిపారు. పొరుగునఉన్న దేశాలనుంచి ఇలా శరణార్థులుగా వస్తున్నవారిలో పిల్లలు, యువకులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని,  ఇప్పటికే ఇలాంటి వారికోసం నిర్దేశించిన షెల్టర్లు నిండిపోయాయని ఆయన చెప్పారు. కానీ ఇప్పటికే సుమారు 15 వేలమందికి పైగా పిల్లలు ఇక్కడికి చేరుకున్నారు. తమకు ఎప్పుడు ఈ దేశ ప్రవేశం లభిస్తుందా అని వీరంతా ఆశగా  ఎదురు చూస్తున్నారు.ఈ ఏడాది సుమారు 20 లక్షలమంది శరణార్థులుగా అమెరికాలోకి రావచ్చ్చునని భావిస్తున్నారు.

అధ్యక్షుడు బైడెన్  స్వయంగా తాను  బోర్డర్ విజిట్ చేస్తానని .’ప్లీజ్ స్టే ఎట్ హోమ్’ అని కోరుతానని తెలిపారు. కాగా వీరి విషయంలో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను విమర్శిస్తున్న రిపబ్లికన్ల తో బాటు  డెమొక్రాట్లు కూడా  పెరిగిపోతున్నారు. లోగడ ట్రంప్ అనుసరించిన విధానంతో బాటు కరోనా వైరస్ పరిస్థితి కూడా ఈ శరణార్ధుల విషయంలో సమస్య సృష్టిస్తోందని అలెజాండ్రో మయెర్కాస్ అంటున్నారు.  తమకు ఓ ప్లాన్ అంటూ ఉందని, దాన్ని అమలు చేస్తామని, కానీ ఇందుకు సమయం పడుతుందని ఆయన చెప్పారు. అసలు ట్రంప్ వల్లే ఈ బెడద వచ్చి పడిందని కూడా అన్నారు. గతవారం కొత్తగా మూడు షెల్టర్లు ఏర్పాటు చేశామని, వీలైతే వీటి సంఖ్యను పెంచే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే  రిపబ్లికన్లు మాత్రం ఈ ప్లాన్ ని తోసిపుచ్చారు. ఈ విధమైన చర్యలు వర్కౌట్ కావని వారన్నారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video

వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.

కూల్ డ్రింక్స్ లో పాము పిల్ల..భయపెడుతున్న వీడియో..!:Snake found in cooldrink bottle Video