అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ‘హనీమూన్’ ముగుస్తున్నట్టేనా ? ముందున్నాయి సవాళ్ల ముళ్ళు !
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రెండు నెలల ' హనీమూన్' ముగిసింది. ఆయన అధ్యక్షపదవిని చేపట్టి సరిగ్గా రెండు నెలలు గడిచాయి. జనవరి 20 న ఆయన ప్రెసిడెంట్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రెండు నెలల ‘ హనీమూన్’ ముగిసింది. ఆయన అధ్యక్షపదవిని చేపట్టి సరిగ్గా రెండు నెలలు గడిచాయి. జనవరి 20 న ఆయన ప్రెసిడెంట్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఈ రెండు నెలలూ తన అధికారిక కార్యకలాపాలను ఆయన సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారు. దేశంలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వదిలిపోయిన ‘కరోనా’ సంక్షోభాన్ని మెల్లమెల్లగా ఎదుర్కొంటూ.. కొంతలో కొంత సఫలీకృతులయ్యారు. తాను పదవిని చేబట్టిన 100 రోజుల్లోగా అమెరికాలో సుమారు 10 కోట్లమందికి కరోనా వ్యాక్సినేషన్ చేయించాలన్న తన లక్ష్యాన్ని బైడెన్ సాధించారు. ఈ పని చేసి తీరుతానని ఆయన మొదట తన హామీల్లో ప్రకటించారు. అలాగే 1.9 ట్రిలియన్ డాలర్ల అమెరికా రెస్క్యూ ప్లాన్..అంటే అమెరికన్లకు జాబ్ అవకాశాలు పెంచడం, కోవిడ్ కారణంగా నష్టపోయిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడం, మైగ్రెన్ట్ల సమస్య పరిష్కారం మొదలైనవి ఆయన ఇఛ్చిన హామీల్లో కొన్ని. రెస్క్యూ ప్లాన్ తాలూకు బిల్లును డెమొక్రాట్లతో సహా రిపబ్లికన్లలో చాలామంది ఆమోదించారు. మొదట ఈ బిల్లుకు డెమొక్రాట్లలో కొందరు అభ్యంతరాలు చెప్పినా చివరకు తలొగ్గక తప్పలేదు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలా కాకుండా, టైం వృధా చేయకుండా ఆయన చకచకా ఈ విధమైన చర్యల విషయంలో దూసుకుపోయారు. సెనెట్ మెజారిటీ లీడర్ షుక్ చుమర్ సైతం దీనికి గ్రీన్ సిగ్నల్ చూపడం విశేషం. మిస్సిసిపికి చెందిన రిపబ్లికన్ సెనెటర్ రోజర్ వికర్ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు వేసినా చివరకు మౌఖికంగా దీనికి ఆమోదం తెలిపారు.
ఇక అగ్రరాజ్యానికి కూడా అప్పులు ఉన్నాయి. ఈ అప్పులను తీర్చేందుకు బైడెన్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. ఈ దేశానికి 27 ట్రిలియన్ డాలర్ల అప్పులు ఉన్నాయి. కరోనా కారణంగా దేశ ఆర్ధిక పరిస్థితి చాలావరకు క్షీణించింది. వీటిని తీర్చేందుకు అటు ప్రతినిధుల సభ, ఇటు సెనేట్ లో బైడెన్ ప్రభుత్వం కీలక బిల్లులను ప్రతిపాదించి సభల చేత ఆమోదింపజేసుకోవలసి ఉంటుంది. సెనెట్ లో 50:50 నిష్పత్తిలో సభ్యులున్నారు. అటు బైడెన్ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్న కారణంగా దేశంలోకి శరణార్ధుల సంఖ్య పెరుగుతోంది. వీరిని ఆదుకుంటామని ఆయన మొదట్లో హామీ ఇచ్సినా ఇప్పుడిది ఆయనకు తలకు మించిన భారమైంది. ఈ సమస్యను ఆయన ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. రిపబ్లికన్లు అడుగడుగునా అడ్డు తగులుతున్న నేపథ్యంలో ఎగువ సభలో ఈ విధమైన బిల్లుల ఆమోదం కష్టమే ! మరిన్ని చదవండి ఇక్కడ : ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video
వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.
జూలో కంచె దాటి సింహం ముందుకు వెళ్లిన వ్యక్తి …పంజా విసిరిన సింహం : Man Attacked By Lion Video