అమెరికన్ ఆసియన్లకు రక్షణ కల్పించాలంటూ అట్లాంటా లో వందలాది మంది ప్రదర్శన
అమెరికాలోని ఆసియన్లకు భద్రత, రక్షణ కల్పించాలంటూ జార్జియా రాజధాని అట్లాంటాలో శనివారం వందలాది అమెరికన్ ఆసియన్లు ర్యాలీ నిర్వహించారు. రేసిజానికి స్వస్తి చెప్పాలని వారు డిమాండ్ చేశారు .
అమెరికాలోని ఆసియన్లకు భద్రత, రక్షణ కల్పించాలంటూ జార్జియా రాజధాని అట్లాంటాలో శనివారం వందలాది అమెరికన్ ఆసియన్లు ర్యాలీ నిర్వహించారు. రేసిజానికి స్వస్తి చెప్పాలని వారు డిమాండ్ చేశారు . ఇటీవల అట్లాంటా లో ఓ యువకుడు మూడు స్పాలలో ప్రవేశించి తన గన్ తో విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 8 మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు ఆసియన్ మహిళలున్నారు. చైనాలోని వూహాన్ సిటీలో మొదట 2019 లో కరోనా వైరస్ ని కనుగొన్నారని, ఇందుకు ఆసియన్ అమెరికన్లే కారణమన్న సాకుతో అమెరికాలో జాతి వివక్ష పేట్రేగుతోందని నిరసనకారులు అన్నారు.అయితే ‘వీ ఆర్ నాట్ ది వైరస్’ (మేం వైరస్ కాదు), ‘స్టాప్ ఏషియన్ హేట్’ (ఆసియన్ల పట్ల ద్వేషాన్ని విడనాడండి) అని రాసి ఉన్న ప్లకార్డులను చేతబట్టుకుని వారంతా ప్రొటెస్ట్ చేశారు. జార్జియా సెనెటర్లు రాఫెల్ వార్నాక్ , జోన్ ఒసాఫ్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. (ఇద్దరూ డెమొక్రాట్లే). అట్లాంటా కాల్పుల్లో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా అంతా నిముషంపాటు మౌనం పాటించారు.
కాల్పులకు పాల్పడిన రాబర్ట్ ఆరాన్ లాంగ్ ఈ హత్యలను జాతి వివక్ష ధోరణితోనే చేశాడా అన్న విషయాన్ని పోలీసులు ఇప్పటికీ ధ్రువీకరించలేదు, అయితే సెక్సిజానికి బానిసైన అతగాడు ద్వేషంతో ఈ మర్దర్లకు పాల్పడ్డాడని తెలుస్తోందని వారన్నారు. అతనిపై 8 మందిని హత్య చేశాడన్న అభియోగాన్ని మోపారు. కాల్పులు జరిపిన అనంతరం తన కారులో పారిపోతున్న అతడిని పోలీసులు అతి కష్టం మీద పట్టుకున్నారు. కాగా ఇతని కాల్పుల్లో మృతి చెందినవారంతా తమ కుటుంబ సభ్యుల వంటివారని, ఆప్తులను కోల్పోయినట్టే తాము బాధ పడుతున్నామని అట్లాంటా ర్యాలీలో పాల్గొన్నవారు వాపోయారు. హంతకుడు ఇంత నిర్దయగా మహిళలను సైతం విడవకుండా హతమార్చాడని, వారి పిల్లలు, బంధువులు, అయినవాళ్లు ఎంతగా తల్లడిల్లుతున్నారోనని నిరసనలో పాల్గొన్న మహిళలు పేర్కొన్నారు. రాబర్ట్ ప్రవేశించిన మూడు స్పాల వద్ద మృతి చెందినవారికి సంతాప సూచనగా వీరు అక్కడ పూల బొకేలను ఉంచారు. క్యాండిల్స్ వెలిగించారు.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :జూలో కంచె దాటి సింహం ముందుకు వెళ్లిన వ్యక్తి …పంజా విసిరిన సింహం : Man Attacked By Lion Video
బద్దలైన అగ్నిపర్వతం వీడియో వైరల్ : The bursting volcano viral video