AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ రూల్స్ బేఖాతర్, భారీగా యువజనుల కేరింతలు, మియామీ బీచ్ లో ఎమర్జెన్సీ విధింపు

అమెరికాను ఇంకా కరోనా వైరస్ వణికిస్తుండగా.. దీని అదుపునకు అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించిన కోవిడ్ ప్రొటొకాల్స్ ను జనం పట్టించుకున్నట్టు కనబడడం లేదు. పలు రాష్ట్రాల్లో  ముఖ్యంగా..

కోవిడ్ రూల్స్ బేఖాతర్,  భారీగా యువజనుల కేరింతలు,  మియామీ బీచ్ లో ఎమర్జెన్సీ విధింపు
Miamibeach Declares State Of Emergency
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 22, 2021 | 1:09 PM

Share

అమెరికాను ఇంకా కరోనా వైరస్ వణికిస్తుండగా.. దీని అదుపునకు అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించిన కోవిడ్ ప్రొటొకాల్స్ ను జనం పట్టించుకున్నట్టు కనబడడం లేదు. పలు రాష్ట్రాల్లో  ముఖ్యంగా  యువత ముఖాలకు మాస్కులు గానీ లేకుండా, భౌతికదూరం పాటించకుండా చెలరేగిపోతున్నారు.  వ్యాక్సిన్లు వచ్చాయి కదా అన్న నిర్లక్ష్యంతో  కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఫ్లోరిడా లోని మియామీ బీచ్ లో సాధారణంగా జనం పరిమితంగా వస్తుంటారు. కానీ శరత్కాలం కావడంతో ఆదివారం ఈ బీచ్ కి భారీ సంఖ్యలో యువతీ, యువకులు చేరుకున్నారు. మద్యం తాగకూడదని పోలీసు ఆంక్షలున్నప్పటికీ ఖాతరు చేయకుండా బీచ్ లో మందు తాగుతూ ఎంజాయ్ చేశారు. మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటింపు వంటివి అసలే లేదు. సౌత్ బీచ్ లో రాత్రి 8 గంటలకే రెస్టారెంట్లు మూసివేస్తారని అధికారులు ప్రకటించినప్పటికీ ఈ ఆదేశాలను ఎవరూ పట్టించుకోలేదు. జార్జియాలోని అట్లాంటాలో ఇటీవల మూడు స్పాలలో చొరబడిన యువకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 8 మందిని పొట్టన బెట్టుకున్న ఘటన నేపథ్యంలో అధికారులు కచ్చితంగా ఈ విధమైన ఆంక్షలను విధించారు. కానీ ఇవేవీ యువతను కదిలించలేకపోయాయి.   సుమారు రెండు మూడు వేలమందికి పైగా  ఈ బీచ్ లో చేరి ఆటపాటలతో గడిపారు. కరోనా వైరస్ ముగిసిందని, ఇక ఆ పరిస్థితి లేదని కొందరు  కేకలు పెట్టారు.

ఈ బీచ్ లో వీరంతా ఇలా రెచ్చి పోవడంతో  అధికారులు  ఎమర్జెన్సీ విధించారు. మియామీని  కనెక్ట్ చేసే మూడు బ్రిడ్జీలను రాత్రి 10 గంటలనుంచిఉదయం 6 గంటలవరకు మూసివేశారు. ఏమైనా ఇక్కడ పరిస్థితి చాలా శృతి మించిపోయిందని మియామీ పోలీస్ అధికారి రిచర్డ్స్ క్లెమెంట్ వ్యాఖ్యానించారు. పోలీసులను చూసి కొందరు భయంతో పరుగులు తీశారని, ఆ సందర్భంగా  గుంపుల తొక్కిసలాటలో కొందరు గాయపడ్డారని ఆయన చెప్పారు.

Miamibeach Declares State Of Emergency 2

Miamibeach Declares State Of Emergency 2

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video

వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.

కూల్ డ్రింక్స్ లో పాము పిల్ల..భయపెడుతున్న వీడియో..!:Snake found in cooldrink bottle Video