యూత్ కి కిక్కెక్కించే వార్త ! ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ కొత్త లిక్కర్ పాలసీ

యూత్ కి కిక్ ఎక్కించే కొత్త విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయబోతోంది. మద్యం తాగడానికి ఇప్పటివరకు  యువకుల వయస్సు 25 ఏళ్లు ఉండాలన్న నిబంధన ఉండేది...

యూత్ కి కిక్కెక్కించే వార్త  ! ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ కొత్త  లిక్కర్ పాలసీ
Legal Drinking Age In Delhi Reduced From 25 To 21
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 22, 2021 | 7:28 PM

యూత్ కి కిక్ ఎక్కించే కొత్త విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయబోతోంది. మద్యం తాగడానికి ఇప్పటివరకు  యువకుల వయస్సు 25 ఏళ్లు ఉండాలన్న నిబంధన ఉండేది. కానీ తాజాగా  ఈ వయస్సును 21 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించింది. కొత్త లిక్కర్ పాలసీని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సోమవారం ప్రకటిస్తూ.. ఎక్కువ ఆదాయాన్ని పొందటానికి వీలుగా దీన్ని రూపొందించినట్టు చెప్పారు. ఎక్సయిజు సంస్కరణల్లో భాగంగా ఈ పాలసీని తెచ్చామని, దీనివల్ల ఏటా 20 శాతం అదనపు ఆదాయం రాగలదని భావిస్తున్నామని ఆయన చెప్పారు. మంత్రిమండలి చేసిన సిఫారసుల ఆధారంగా కేబినెట్ ఈ నూతన పాలసీని ఆమోదించినట్టు ఆయన చెప్పారు. నగరంలో కొత్తగా మద్యం షాపులను తెరవరాదని నిర్ణయించామని, అలాగే ఇకపై ప్రభుత్వం లిక్కర్ దుకాణాలను నిర్వహించబోదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 60 శాతం మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. సుమారు 850 దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండగా…. లిక్కర్ మాఫియా 2 వేలకు పైగా షాపులను నిర్వహిస్తోందని సిసోడియా తెలిపారు.

ఎక్సయిజు సంస్కరణల వల్ల నగరంలో లిక్కర్ మాఫియా రోల్ ముగుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత 2 ఏళ్లలో ఎక్సయిజు అధికారులు 7 లక్షలకు పైగా అక్రమ లిక్కర్ బాటిల్స్ ని  స్వాధీనం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. 21 ఏళ్ళ లోపు వారిని మద్యం షాపుల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. తమ షాపుల వద్ద మద్యం ప్రియులు లిక్కర్   తాగకుండా చూడాలని షాపుల నిర్వాహకులను ఆదేశించినట్టు వెల్లడించారు. ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని కోరామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు లిక్కర్ స్టోర్స్ ఉండాలని ప్రభుత్వం కోరుతోందని మనీష్ సిసోడియా తెలిపారు.

మరిన్ని ఇక్కడ చూడండి: BIS Hallmarking Scheme: జూన్ 1 తర్వాత ఆ బంగారాన్ని అమ్మలేరు.. కొత్తగా కొనాలన్నా ఈ నిబంధనలు పాటించాల్సిందే..!

‘ఇది కంఫర్ట్ జోన్ కాదు.. కానీ జీవితమంటేనే ఓ ప్రయోగం’.. కష్టాలను చెప్పుకుంటున్న రేణు దేశాయ్..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు