IIT Recruitment: ఐఐటీ హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు.. నెలకు రూ. లక్షన్నరకుపైగా జీతం..
IIT Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ క్యాంపస్‌లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీ ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
IIT Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ క్యాంపస్‌లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీ ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, డిజైన్, మ్యాథమేటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వంటి పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట అకడమిక్ అర్హత, పని అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,01,500 నుంచి రూ. 1,59,100 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 15-04-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Tirumala: తిరుమలలో విద్యుత్ ఆదాకు TTD కీలక నిర్ణయం.. ఈవో అధికారులతో సమీక్ష
Chicken Prices: ట్రిపుల్ సెంచరీ కొట్టిన చికెన్.. రేటు తెలిస్తే ముద్ద దిగడమూ కష్టమే