Teaching Jobs: హైదరాబాద్ అటామిక్ ఎనర్జీ స్కూల్‌లో టీచర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Teaching Jobs: హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ స్కూల్‌లో (AICS) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ స్కూల్‌లో టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Teaching Jobs: హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌లో (AICS) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ స్కూల్‌లో టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా టీజీటీ, పీఆర్‌టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* బయోలజీ, కెమిస్ట్రీ, సోషల్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్/ హిందీ/ ఫిజిక్స్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బీఈడీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
* పీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సీనియర్ సెకండరీ/ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ టెస్ట్/ ఇంటర్/ డీఈఐఈడీ/ బీఈఐఈడీ/ డీఈడీ/ బీఈడీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను సెక్యూరిటీ ఆఫీస్, డీఏఈ కాలనీ, డీ సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్, హైదరాబాద్ 50062 అడ్రస్‌కు పంపించాలి.
* టీజీటీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 26, 250, పీఆర్‌టీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 21,250 చెల్లిస్తారు.
* అభ్యర్థులను రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 23-03-2022న ప్రారంభం కాగా 26-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Gannavaram Politics: గన్నవరంలో వేడెక్కిన రాజకీయం.. ఒరిజినల్ వైసీపీ వర్సెస్ నయా వైసీపీ మధ్య ఫైట్!
IND vs SL: భారత్, శ్రీలంక పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ అసంతృప్తి.. బిలో యావరేజ్ అంటూ..
Krithi Shetty: బేబమ్మా మజాకా.. అప్పుడే అక్కడి నుంచి పిలుపు అందుకున్న కృతీశెట్టి.?