AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter Exams: పరీక్షల కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసిన ఏపీ ఇంటర్‌ బోర్డ్‌.. పూర్తి వివరాలు..

AP Inter Exams: జేఈఈ పరీక్షల (JEE Exams) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఏపీలో ఇంటర్‌ పరీక్షలను (Inter Exams) మే 6వ తేదీ నంచి మే 24 వరకు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కానీ జేఈఈ పరీక్షల..

AP Inter Exams: పరీక్షల కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసిన ఏపీ ఇంటర్‌ బోర్డ్‌.. పూర్తి వివరాలు..
Narender Vaitla
|

Updated on: Mar 21, 2022 | 7:23 AM

Share

AP Inter Exams: జేఈఈ పరీక్షల (JEE Exams) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఏపీలో ఇంటర్‌ పరీక్షలను (Inter Exams) మే 6వ తేదీ నంచి మే 24 వరకు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కానీ జేఈఈ పరీక్షల కారణంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది ఇంటర్‌ బోర్డ్‌. మారిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు మే 6న ప్రారంభమై, మే 23వ తేదీతో ముగియనున్నాయి. ఇక సెకండ్‌ ఇయర్‌ విషయానికొస్తే మే 7వ తేదీ నుంచి మే 24వరకు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

ఏపీ ఇంటర్‌ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే..

ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షల షెడ్యూల్‌..

* మే 6 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

* మే 9 – ఇంగ్లీష్ పేపర్-1

* మే 11 – మ్యాథ్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1

* మే 13 – మ్యాథ్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

* మే 16 – ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1

* మే 18 – కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1

* మే 20 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు)

* మే 23 – మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జియాగ్రఫీ పేపర్-1

సెకండ్‌ ఇయర్‌ షెడ్యూల్‌..

* మే 7 – సెకండ్ లాంగ్వేష్ పేపర్-II

* మే 10 – ఇంగ్లిష్ పేపర్-II

* మే 12 – మ్యాథ్స్ పేపర్-II-A

* మే 14 – మ్యాథ్స్ పేపర్-II-B, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II

* మే 17 – ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II

* మే 19 – కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II, సోషియాలజీ పేపర్-II, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II

* మే 21 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, లాజిక్ పేపర్-II, మ్యాథ్స్ పేపర్-II (బైపీసీ విద్యార్థులకు)

* మే 24 – మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II

Inter Exams

Also Read: Gold Silver Price Today: నిలకడగా బంగారం, వెండి ధరలు.. దేశంలో తాజా రేట్ల వివరాలు

Holi in US: అమెరికాలో ఘనంగా హొలీ సంబరాలు.. రంగుల్లో మునిగితేలిన జనం

Bodhan Issue: బోధన్ సంఘటనపై డిజిపి, కమీషనర్ లతో మాట్లాడిన హోం మంత్రి మహమూద్ అలీ..