Krithi Shetty: బేబమ్మా మజాకా.. అప్పుడే అక్కడి నుంచి పిలుపు అందుకున్న కృతీశెట్టి.?
Krithi Shetty: సినీ పరిశ్రమలో (Movie Industry) సక్సెస్ అందుకోవడం అంత సులభమైన విషయమేమి కాదు. అందులోనూ ఒక్క సినిమాతోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడం ఆశామాషీ వ్యవహారం కాదు. కానీ అందాల తార కృతీ శెట్టి మాత్రం ఒక్కటంటే ఒక్క సినిమాతోనే...
Krithi Shetty: సినీ పరిశ్రమలో (Movie Industry) సక్సెస్ అందుకోవడం అంత సులభమైన విషయమేమి కాదు. అందులోనూ ఒక్క సినిమాతోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడం ఆశామాషీ వ్యవహారం కాదు. కానీ అందాల తార కృతీ శెట్టి మాత్రం ఒక్కటంటే ఒక్క సినిమాతోనే భారీ క్రేజ్‌ను దక్కించుకుంది. ఉప్పెనలో (Uppena) తన అద్భుత నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ అనతికాలంలోనే అగ్ర హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఉప్పెన భారీ విజయంతో కృతీకి ఆఫర్లు వెల్లువలా దూసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతులో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇక తాజాగా ఏకంగా ప్రభాస్ సరసన నటించే చాన్స్ కొట్టేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం కృతీకి మరో బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
తెలుగులో కేవలం రెండేళ్లలో ఆరు సినిమాలకు కమిట్ అయిన ఈ బ్యూటీకి ఇప్పుడు ఏకంగా బీటౌన్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో కృతీని హీరోయిన్‌గా తీసుకునేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కృతీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్‌ను షాహీద్ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని, శ్యామ్ సింగరాయ్‌లో నటించిన కృతీనే బాలీవుడ్‌లోనూ తీసుకోవాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై ఓ స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే షాహిద్ కపూర్ ఇప్పటికే అర్జున్ రెడ్డి, జెర్సీ సినిమాల రీమేక్‌లతో బాలీవుడ్‌లో మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే.
Also Read: Diesel Price Hike: దేశంలో పెట్రో ధరల మంట.. బల్క్ యూజర్లకు భారీగా పెంపు.. ఏకంగా లీటర్‌కు రూ.25
Sreemukhi: అందాల ముద్దుగుమ్మ హొయలు కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. అదిరిన లేటెస్ట్ పిక్స్