Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట సెకండ్ సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయిన ‘పెన్నీ’ పాట
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సర్కారు వారి పాట.
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సర్కారు వారి పాట. ఈ మూవీ నుంచి వస్తున్న ప్రతి ఒక్క అప్‌డేట్‌తో అంచనాలను పెంచుతోంది. మొదటిగా, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది, ఇందులో మొదటి సింగిల్ ఇప్పటికీ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. ముందుగా తెలిపినట్లుగా, రెండవ సింగిల్ పెన్నీ సాంగ్ ను విడుదల చేశారు.
ఈ పాటలో మహేష్ బాబు కుమార్తె ప్రిన్సెస్ సితార ఘట్టమనేని కూడా ఉన్నారు. సితార మ్యూజిక్ వీడియోలో కనిపించడం ఇదే తొలిసారి. మహేష్ బాబు స్టైలిష్, సితార క్యూట్ ట్రెండీ స్టెప్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆమె డాన్స్ తో పాటు మహేష్ బాబు కూడా కనిపించడం అభిమానులకు పండగలా ఉంది. ఈ పాట వెండితెరపై అభిమానులకు ఫీస్ట్ లా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అనంత శ్రీరామ్ సంగీతం అందించిన ఈ హుషారైన పాట పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :