ICMR – NIV Recruitment: ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
ICMR - NIV Recruitment: కరోనా మహమ్మారి కారణంగా వైరాలజీ రంగంలో పరిశోధనలు బాగా పెరిగాయి. ఈ క్రమంలోనే పరిశోధనలకు కావాల్సిన ఉద్యోగులను సంస్థలు పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే...
ICMR – NIV Recruitment: కరోనా మహమ్మారి కారణంగా వైరాలజీ రంగంలో పరిశోధనలు బాగా పెరిగాయి. ఈ క్రమంలోనే పరిశోధనలకు కావాల్సిన ఉద్యోగులను సంస్థలు పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పుణెలోని ఐసీఎంఆర్–నేషన్‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ).. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ విధానంలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 53 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ (06), ప్రాజెక్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో (02), ప్రాజెక్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో (04), ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్ (01), ప్రాజెక్ట్ ఎకనమిస్ట్ ఎవల్యూషన్ స్పెషలిస్ట్ (01), ప్రాజెక్ట్ నర్సింగ్ సపోర్ట్ (03), ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ (36). పోస్టులు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. * అభ్యర్థుల వయసు పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.18,000 నుంచి రూ.70,000 చెల్లిస్తారు. * అభ్యర్థులను ఇంటర్వూ/పర్సనల్ డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. * దరఖాస్తును ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, 20–ఏ, డా.అంబేద్కర్ రోడ్, పోస్ట్ బాక్స్ నెం.11,పుణె–411001 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. * దరఖాస్తుల స్వీకరణ 13-08-2021తో ముగియనుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Honey : ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె..! కిలో ధర రూ.7435.. ఇంత రేటు ఎందుకో తెలుసా..?
RRR Movie: ఆర్ఆర్ఆర్ సెట్లో గందరగోళం.. సీరియస్ అయిన రామ్ చరణ్.. కారణం ఏంటో తెలుసా..
హై అలెర్ట్.. పాకిస్తాన్ భారీ కుట్ర.. తిప్పికొట్టిన పంజాబ్ పోలీసులు.. పిల్లల టిఫిన్ బాక్సుల్లో