AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey : ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె..! కిలో ధర రూ.7435.. ఇంత రేటు ఎందుకో తెలుసా..?

Honey : తేనె అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేనె గురించి మీకు తెలుసా..? దీని పేరే మనుకా హనీ. ఈ తేనె చాలా ఖరీదైనది మీరు

Honey : ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె..! కిలో ధర రూ.7435.. ఇంత రేటు ఎందుకో తెలుసా..?
Manuka Honey
uppula Raju
|

Updated on: Aug 09, 2021 | 1:39 PM

Share

Honey : తేనె అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేనె గురించి మీకు తెలుసా..? దీని పేరే మనుకా హనీ. ఈ తేనె చాలా ఖరీదైనది మీరు దీనిని కొనలేరు. ప్రపంచంలో అనేక రకాల తేనె ఉత్పత్తులు ఉన్నప్పటికీ మనుకా హనీ వాటికి భిన్నంగా ఉంటుంది. దీనికి ఎందుకంత డిమాండ్ ఉంటుందో తెలుసుకోవాలని ఉంటే చదవండి..

న్యూజిలాండ్‌లో తయారు చేస్తారు.. మనుకా తేనె న్యూజిలాండ్ ప్రత్యేకతలలో ఒకటి. ఈ తేనెను లెప్టోస్పెర్మ్ స్కోపెరియం చెట్టు నుంచి తయారు చేస్తారు. ఈ చెట్టు న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపిస్తుంది అంతేకాదు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఈ చెట్టును న్యూజిలాండ్‌లో స్థానిక భాషలో మావోరి అని పిలుస్తారు. అందుకే ఈ తేనెను మనుకా హాని అంటారు. దీని ధరలు 1, 2 కాదు మిగిలిన తేనె కంటే 100 రెట్లు ఎక్కువ. 100 గ్రాముల తేనె ధర 99 డాలర్లు అంటే భారతీయ రూపాయిలలో 7435 రూపాయలు.

చెట్టు చాలా ప్రత్యేకమైనది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. న్యూజిలాండ్‌లో మనుకా చెట్లు అంతగా లేవు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం తేనెలో 1% మాత్రమే ఈ చెట్టు నుంచి తయారవుతుంది. ఈ తేనెను ద్రవ బంగారం అంటారు. మనుక చెట్టు చాలా ఎత్తు ప్రదేశాల్లో పెరుగుతాయి. దీని కారణంగా తేనెటీగల పెంపకందారులు ఆ చెట్లను చేరుకోవడం కష్టమవుతుంది. ఈ తేనెను పొందడానికి తేనెటీగలు 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందని ఈ తేనె తయార చేసేవారు చెబుతున్నారు. తేనెను సేకరించడానికి పెంపకందారులు ఒక్కోసారి హెలికాప్టర్ల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఈ తేనె ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.

పువ్వు కొద్దిసేపు మాత్రమే వికసిస్తుంది ప్రతి సంవత్సరం మానుకా పువ్వు వారంలో 2 నుంచి 8 వారాలు మాత్రమే వికసిస్తాయి. వాతావరణ పరిస్థితులు పువ్వు వికసించడంపై ప్రభావాన్ని చూపుతాయి. మనుకా హనీని అనేక రకాల ఆరోగ్య, సౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు. ఈ తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ కారణంగా దీనిని చర్మ ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు.

Pears Fruit : పియర్స్ పండ్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..! హార్ట్ పేషెంట్లకు, ఒబేసిటీ సమస్యలున్నవారికి దివ్య ఔషధం..

Richest Village: దక్షిణాసియాలో అత్యంత ధనిక గ్రామం.. వివిధ బ్యాంకుల్లో రూ. 5200 కోట్ల డిపాజిట్లు..ఇప్పటికే వ్యవసాయం చేస్తారు..

ఈ సూపర్ స్టైలిష్ చైల్డ్ ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్లను చూపుల్తోనే కట్టిపడేస్తుంది