Hiring trends 2021: కరోనా కారణంగా ఉద్యోగులను నియమించుకునే విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయి.. నిపుణుల మాటేంటి.
Hiring trends 2021: కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగ రంగం బాగా ప్రభావితమైన విషయం తెలిసిందే. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోగా కొత్త ఉద్యోగాలు లేక మరికొందరు సతమతమయ్యారు. మరీ ముఖ్యంగా...
Hiring trends 2021: కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగ రంగం బాగా ప్రభావితమైన విషయం తెలిసిందే. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోగా కొత్త ఉద్యోగాలు లేక మరికొందరు సతమతమయ్యారు. మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో రిక్రూట్‌మెంట్ ట్రెండ్ ఎలా ఉంది? కరోనా ఉద్యోగాల నియామకంపై ఎలాంటి ప్రభావం చూపింది లాంటి వాటిపై ఇంపెట్యూస్ టెక్నాలజీస్ సంస్థకు చెందిన మానవ వనరుల (హెచ్‌ఆర్) డైరెర్టకర్ అభిషేక్ కుమార్ సింగ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ప్రస్తుతం ఫ్రెజర్స్ నియామకం కాస్త నెమ్మదిగా సాగుతున్నప్పటికీ కచ్చితంగా వేగాన్ని పుంజుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇక తక్కువ జీతానికి ఉద్యోగులను తీసుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ఎక్కువ జీతాలకు ఉద్యోగులను తీసుకుంటూ కంపెనీ లాభాలపై ప్రభావం చూపుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
నియామకాలపై కరోనా ఎలాంటి ప్రభావం చూపింది..
కరోనా మహమ్మారి కారణంగా హెచ్‌ఆర్.. ఉద్యోగులను తీసుకునే విధానంలో మార్పులు వచ్చాయన్న దానిని మీరు సమర్థిస్తారా.? అన్న ప్రశ్నకు బదులిచ్చిన అభిషేక్.. ఐటీ రంగంలో ఉద్యోగాల నియామకం బాగా పెరిగింది. అది ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ అయ్యుండొచ్చు, అనుభవం ఉన్న వారు కావొచ్చు. ప్రస్తుతం పెరుగుతోన్న డిజిటలైజేషన్ కారణంగా సరికొత్త సాఫ్ట్‌వేర్‌లు, నైపుణ్యాలు కావాల్సి వస్తోంది. భారత్‌లోని చాలా ఐటీ కంపెనీలు అమెరికా వ్యాపారాలను నడిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన చాలా మంది క్లయింట్స్ ఆన్‌సైట్‌లో ఉద్యోగులను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగానే జీతాలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
సత్తా ఉన్న వారికి ఢోకా లేదు..
సరైన సబ్జెక్ట్ సత్తా ఉన్నా అభ్యర్థులకు ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. సత్తా ఉన్న అభ్యర్థిని తీసుకోవాలంటే జీతం విషయంలో ఇతర కంపెనీలతో పోటీపడాల్సి వస్తోంది. మంచి ప్రతిభకనబరిచే వారిని కంపెనీలు వెతికి మరీ సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఫ్రెషర్స్‌ను తీసుకునే సమయంలో అభ్యర్థులకు బిగ్ డేటా, క్లౌడ్ టెక్నాలజీలు అంతకు ముందే తెలుసా.. అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోము కేవలం వారి పరిజ్ఞానాన్ని, ఆల్గరిథమ్స్, డేటా స్ట్రక్చర్, వారిలోని ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను మాత్రమే చూస్తాం.
క్లౌడ్ టెక్నాలజీపై దృష్టి సారిస్తున్నాం..
క్లౌడ్ లాంటి టెక్నాలజీస్‌లో ఉద్యోగులను తీసుకునేందుకు అనుభవాన్ని మేము ప్రతిపాదికగా తీసుకుంటాం. దీనికి కారణం కొత్త టెక్నాలజీలను హ్యాండిల్ చేయాలంటే అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వేగంగా పనిచేయని వారు, శిక్షణ అవసరమైన వారిని కంపెనీలు తీసుకోవడానికి ఆసక్తి చూపించవు. ప్రస్తుతం దాదాపు అన్ని ఐటీ కంపెనీలు డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ టెక్నాలజీలపై దృష్టి సారిస్తోంది.
ఉద్యోగ నియామకాల్లో ఎదురయ్యే ఇబ్బందులు..
నిజానికి చాలా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి కానీ సరైన శిక్షణ తీసుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. డిమాండ్ పెరిగే సరికి జీతాలు భారీగా పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో కంపెనీలు నిలదొక్కుకోవడం ప్రశ్నార్థకంగా మారుతుంది. నైపుణ్యం కలిగిన వారు తక్కువగా ఉండడం వల్ల వారికి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఉద్యోగులను భారీ జీతాలకు తీసుకోవడం వల్ల సంస్థల లాభాలు తగ్గడమే దీనికి కారణం.
Also Read: ‘మిమ్మల్ని టచ్ చేస్తే చాలు.. తిరగబడండి’.. బీజేపీ కార్యకర్తలకు కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప హితవు
PM Modi: దేశ యువతకు స్ఫూర్తినిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం.. ప్రధాని మోదీ
Hyderabad: సెక్యూరిటీపై దాడి.. హైదరాబాద్ జువైనల్ హోమ్ నుంచి మైనర్లు ఎస్కేప్.. దొరకని ఆచూకి