AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మిమ్మల్ని టచ్ చేస్తే చాలు.. తిరగబడండి’.. బీజేపీ కార్యకర్తలకు కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప హితవు

మిమ్మల్ని ఎవరు టచ్ చేసినా (మీపై దాడికి దిగినా) వెంటనే తిరగబడాలని కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే.ఎస్. ఈశ్వరప్ప బీజేపీ కార్యకర్తలకు 'పిలుపు నిచ్చారు'.

'మిమ్మల్ని టచ్ చేస్తే చాలు.. తిరగబడండి'.. బీజేపీ కార్యకర్తలకు కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప హితవు
K. S. Eshwarappa
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Aug 09, 2021 | 1:24 PM

Share

మిమ్మల్ని ఎవరు టచ్ చేసినా (మీపై దాడికి దిగినా) వెంటనే తిరగబడాలని కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే.ఎస్. ఈశ్వరప్ప బీజేపీ కార్యకర్తలకు ‘పిలుపు నిచ్చారు’. ఒకరు కర్రతో కొడితే అదే కర్రతో వారిపై రెండిచ్చుకోండి”అన్నారు. ఇది ఆదేశం అనుకోండి అని వ్యాఖ్యానించారు. తన షిమోగా నియోజకవర్గంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బీజేపీ గతంలో కన్నా ఇప్పుడు ఎంతో బలోపేతమైందని, మీరెవరికీ భయపడాల్సిన పని లేదన్నారు. ఒకప్పుడు పొరుగున్న కేరళలో ఆర్ ఎస్ ఎస్ శాఖను ప్రారంభించడానికి ఎవరైనా వెళ్తే వారిని చంపేసేవారని.. అప్పుడు మనకు అంత శక్తి ఉండేది కాదని ఆయన చెప్పారు. సంయమనంతో వ్యవహారించాల్సిందిగా సంఘ్ పరివార్ పెద్దలు మనకు చెప్పేవారని, అందువల్ల మనం మౌనంగా ఉండిపోవాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదిగిందని.. ప్రస్తుతం మనలను ఎదుర్కోవడానికి ఎవరికీ సాహసం లేదని ఈశ్వరప్ప అన్నారు. ఆ నాటి పరిస్థితి వేరని, ఇప్పటి పరిస్థితి వేరని ఆయన పేర్కొన్నారు.

కాగా ఈ మంత్రి ఇలా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని. ఆయనను కేబినెట్ నుంచి తొలగించాలని లేదా ఆయన రాజీనామా చేయాలనీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అసలు ఈయన ఎమ్మెల్యే కావడమే గొప్ప అని, అలాంటిది మంత్రి అయ్యాక ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని సోషల్ డెమాక్రేటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఆరోపించింది. స్పీకర్ ఆయనను లెజిస్లేచర్ నుంచి సస్పెండ్ చేయాలని కోరింది. ఈశ్వరప్ప గతంలో కూడా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారని ఈ పార్టీ పేర్కొంది.

మరిన్ని ఇక్కడ చూడండి: PM Modi: దేశ యువతకు స్ఫూర్తినిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం.. ప్రధాని మోదీ

Hyderabad: సెక్యూరిటీపై దాడి.. హైదరాబాద్‌ జువైనల్‌ హోమ్‌ నుంచి మైనర్లు ఎస్కేప్.. దొరకని ఆచూకి

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!