PM Modi: దేశ యువతకు స్ఫూర్తినిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం.. ప్రధాని మోదీ
క్విట్ ఇండియా ఉద్యమం దేశ యువతకు స్ఫూర్తిని, శక్తిని ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నాడు జరిగిన పోరును మరింత శక్తిమంతం చేయడంలో ఈ ఉద్యమం కీలక పాత్ర వహించిందన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమం దేశ యువతకు స్ఫూర్తిని, శక్తిని ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నాడు జరిగిన పోరును మరింత శక్తిమంతం చేయడంలో ఈ ఉద్యమం కీలక పాత్ర వహించిందన్నారు. సోమవారం 79 వ క్విట్ ఇండియా ఉద్యమ యానివర్సరీ సందర్భంగా ఆయన..నాటి ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమర యోధులకు నివాళులర్పించారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఆ నాడు దేశవ్యాప్తంగా యువత కదన రంగంలో తమ శక్తిని చాటిందని, బలోపేతమైందని ఆయన పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఈ ఉద్యమం మైలురాయని ఆయన అభివర్ణించారు. 1942 ఆగస్టు 9 న ముంబై లోని గవాలియా ట్యాంక్ నుంచి ఉద్యమం ప్రారంభమైంది. సామ్రాజ్యవాదాన్ని నిర్మూలించడానికి దేశ ప్రజలంతా ఒక్కటి కావాలని నాడు మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు.దేశం నుంచి బ్రిటిషర్లను పారదోలేందుకు ‘డూ ఆర్ డై’ అని నినదించారు. ప్రతి ఏడాది ఆగస్టు 9 న క్రాంతి దివస్ గా పాటించాలని ప్రభుత్వం పిలుపు నిచ్చిన విషయం గమనార్హం.
ఇలా ఉండగా ఉత్తరప్రదేశ్ లో నేటి నుంచి రెండు రోజులపాటు భారీ నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే నిర్ణయించింది .. బీజేపీ గద్దీ చోడో (బీజేపీ గద్దె దిగు) అనే నినాదంతో 403 నియోజకవర్గాల్లోనూ ఈ ప్రొటెస్ట్ మార్చ్ నిర్వహించాలని తీర్మానించింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ భల్లా వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Pears Fruit : పియర్స్ పండ్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..! హార్ట్ పేషెంట్లకు, ఒబేసిటీ సమస్యలున్నవారికి దివ్య ఔషధం..