Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఐదుగురు దుర్మరణం..

Accident in Bihar's Araria: బీహార్‌లోని అరారియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆటోను ట్రక్కు ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఐదుగురు దుర్మరణం..
Road Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 09, 2021 | 1:08 PM

Accident in Bihar’s Araria: బీహార్‌లోని అరారియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆటోను ట్రక్కు ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. సోమవారం ఉదయం అరారియా వద్ద చోటుచేసుకుంది. అరారియా ప్రధాన రహదారిపై ఆటో వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢికొట్టిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కాగా.. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అరారియా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

10 మంది ప్రయాణికులతో పూర్నియా నుంచి వెళ్తున్న ఆటోరిక్షా అరారియా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. కాగా.. ఈ ప్రమాదం అనంతరం డ్రైవర్.. ట్రక్కుతో సహా పరారయ్యాడని పోలీసులు తెలిపారు. లారీ, డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు అరారియా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పుష్కర్ కుమార్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా బధాడాలో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఓ టక్కు రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దీంతో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన గుడిసెలో కుటుంబసభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read:

GANGSTER NAEEM: గ్యాంగ్‌స్టర్‌ నయీం సామ్రాజ్యం పతనానికి ఐదేళ్లు.. బాధితులకు ఇప్పటికీ దక్కని న్యాయం.. అసలేం జరుగుతోంది..

AP Crime: టిప్పర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు దుర్మరణం.. కంకర లోడ్‌తో వెళుతుండగా..

బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో