IBPS SO Recruitment 2021: నిరుద్యోగులకు గమనిక.. 1828 బ్యాంకు పోస్ట్‌లకు రేపే చివరితేదీ..

IBPS SO Recruitment 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తరపున స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ అంటే 23 నవంబర్ 2021.

IBPS SO Recruitment 2021: నిరుద్యోగులకు గమనిక.. 1828 బ్యాంకు పోస్ట్‌లకు రేపే చివరితేదీ..
Ibps So
Follow us
uppula Raju

|

Updated on: Nov 22, 2021 | 5:35 PM

IBPS SO Recruitment 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తరపున స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ అంటే 23 నవంబర్ 2021. ఫీజు చెల్లించడానికి కూడా ఇదే లాస్ట్‌ డేట్‌. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ఖాళీలకు ప్రిలిమ్స్ పరీక్ష 26 డిసెంబర్ 2021న నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష 30 జనవరి 2022న నిర్వహిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్‌ను పరిశీలించండి.

ఖాళీ వివరాలు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1828 ఖాళీలు ఉంటాయి. స్పెషలిస్ట్ ఆఫీసర్‌లు 220 పోస్టులు, ఐటీ ఆఫీసర్‌కు 220, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్‌కు 884 పోస్టులు, రాజభాష అధికారికి 84 పోస్టులు, లా ఆఫీసర్‌కు 44 పోస్టులు, హెచ్‌ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్‌కు 61 పోస్టులు, మార్కెటింగ్ ఆఫీసర్‌కు 535 పోస్టులు ఉంటాయి.

అర్హత విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. వివిధ పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉంటాయి. ఇందులో IT ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి B లెవల్ సర్టిఫికేట్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇది కాకుండా అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అగ్రికల్చర్ ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

అదే సమయంలో రాజ్‌భాషా అధికారి పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు హిందీ సబ్జెక్టు నుంచి మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టును ఒక సబ్జెక్ట్‌గా కలిగి ఉండటం తప్పనిసరి. అంతే కాకుండా సంస్కృతంలో మాస్టర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు. లా ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేయడానికి ఒకరు 3 లేదా 5 సంవత్సరాల LLB డిగ్రీని కలిగి ఉండాలి. అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

వయస్సు పరిధి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 ఏళ్లు పైబడి 30 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 నవంబర్ 2021 నాటికి లెక్కిస్తారు. రిజర్వేషన్ల పరిధిలోకి వచ్చే అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.

దరఖాస్తు రుసుము ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.850 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.175గా నిర్ణయించారు. ఫీజును డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించవచ్చు.

SMAT 2021: చివరిబంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన షారుక్‌ ఖాన్‌.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత తమిళనాడు

ఇల్లు కొనడానికి బంపర్‌ ఆఫర్.. ఈ-వేలంలో పాల్గొనండి.. తక్కువ ధరకే కొనుగోలు చేయండి..

రోహిత్‌ శర్మ పని పూర్తయింది.. కానీ విరాట్‌ కోహ్లీ, రహానే పని మిగిలే ఉంది.. ఏంటో తెలుసా..?