AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SMAT 2021: చివరిబంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన షారుక్‌ ఖాన్‌.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత తమిళనాడు

SMAT 2021: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని తమిళనాడు కైవసం చేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో తమిళనాడు 4 వికెట్ల తేడాతో కర్ణాటకపై వి

SMAT 2021: చివరిబంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన షారుక్‌ ఖాన్‌.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత తమిళనాడు
Shahrukh
uppula Raju
|

Updated on: Nov 22, 2021 | 4:39 PM

Share

SMAT 2021: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని తమిళనాడు కైవసం చేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో తమిళనాడు 4 వికెట్ల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 20 ఓవర్లలో 151 పరుగులు చేయగా, తమిళనాడు చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. షారుక్‌ ఖాన్‌ ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తమిళనాడు చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా ప్రతీక్ జైన్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్ సిక్సర్ బాదాడు.

షారుక్ ఖాన్ 15 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. షారుక్ తన వేగవంతమైన ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, ఒక ఫోర్ ఉంది. ఒత్తిడితో కూడిన క్షణాల్లో షారుఖ్ ఖాన్ ఆటతీరు అద్భుతం. తమిళనాడు విజయంలో షారుక్‌తో పాటు ఆర్‌ సాయి కిషోర్‌ కూడా బాగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో కర్ణాటక సులువుగా గెలిచే అవకాశం ఉంది కానీ తమిళనాడు చివరి రెండు ఓవర్లలో ఆటను మార్చేసింది. ఆఖరి ఓవర్‌లో తమిళనాడుకు 16 పరుగులు కావాలి. కర్ణాటక కెప్టెన్ మనీష్ పాండే బంతిని ప్రతీక్ జైన్ చేతికి అందించాడు. చివరి 6 బంతుల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

1. తొలి బంతికే థర్డ్ మ్యాన్ బౌండరీ నుంచి సాయి కిషోర్ ఫోర్ కొట్టాడు. 2. రెండో బంతి – సాయి కిషోర్ 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. 3. మూడో బంతి- ప్రతీక్ జైన్ మూడో బంతిని వైడ్‌గా వేశాడు. దీని తర్వాత షారుఖ్ ఖాన్‌కు ఒక్క పరుగు మాత్రమే అనుమతించాడు. ఇప్పుడు తమిళనాడుకు 3 బంతుల్లో 9 పరుగులు కావాలి. 4. నాలుగో బంతి – సాయి కిషోర్ ఒక పరుగు మాత్రమే చేశాడు. ఇప్పుడు తమిళనాడుకు 2 బంతుల్లో 8 పరుగులు అవసరం. షారుక్ ఖాన్ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 5. ఐదో బంతి – ప్రతీక్ జైన్ మళ్లీ వైడ్‌గా విసిరాడు. తమిళనాడుకు 2 బంతుల్లో 7 పరుగులు కావాలి. దీని తర్వాత ప్రతీక్ జైన్ యార్కర్ వేశాడు. షారూక్ ఖాన్ లాంగ్ ఆఫ్‌లో షాట్ ఆడుతూ రెండు పరుగులు చేశాడు. 6. చివరి బంతికి తమిళనాడు విజయానికి 5 పరుగులు కావాలి. ప్రతీక్ జైన్ వేసిన చివరి బంతిని డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీపై షారుక్ ఖాన్ సిక్సర్ కొట్టి జట్టుని గెలిపించాడు.

Zodiac Signs: ఈ 3 రాశులవారు వివాహానికి తొందరపడుతారు..! ఆ రాశులేంటో తెలుసా..?

PF Clients: పీఎఫ్‌ ఖాతాదారులకు గమనిక..! ఇప్పుడు ఉద్యోగం మానేస్తే ఈ పని చాలా సులభం..

రోహిత్‌ శర్మ పని పూర్తయింది.. కానీ విరాట్‌ కోహ్లీ, రహానే పని మిగిలే ఉంది.. ఏంటో తెలుసా..?

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?