రోహిత్‌ శర్మ పని పూర్తయింది.. కానీ విరాట్‌ కోహ్లీ, రహానే పని మిగిలే ఉంది.. ఏంటో తెలుసా..?

IND vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన టీ 20 సిరీస్‌ని భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. రోహిత్ శర్మ నేతృత్వంలో ఈ పని జరిగింది. అయితే ఇప్పుడు అజింక్యా రహానే, విరాట్ కోహ్లి కెప్టెన్సీ

రోహిత్‌ శర్మ పని పూర్తయింది.. కానీ విరాట్‌ కోహ్లీ, రహానే పని మిగిలే ఉంది.. ఏంటో తెలుసా..?
Virat Kohli, Rahane
Follow us
uppula Raju

|

Updated on: Nov 22, 2021 | 3:45 PM

IND vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన టీ 20 సిరీస్‌ని భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. రోహిత్ శర్మ నేతృత్వంలో ఈ పని జరిగింది. అయితే ఇప్పుడు అజింక్యా రహానే, విరాట్ కోహ్లి కెప్టెన్సీ బలం ఏంటో తెలియాల్సి ఉంది. ఒకవేళ వీరు న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌ని క్లీన్‌స్వీప్‌ చేస్తే ఇండియా టెస్టుల్లో నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధిస్తుంది. కాన్పూర్ టెస్టు అజింక్యా రహానే చేతిలో ఉంటే.. ముంబై టెస్టు విరాట్ కోహ్లీ చేతిలో ఉంది. ఈ రెండు టెస్టుల్లోనూ భారత్ గెలిస్తే టెస్టులో నంబర్ వన్ జట్టుగా ఎదగవచ్చు.

అజింక్యా రహానే కెప్టెన్సీలో భారత జట్టు నవంబర్ 25 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో తొలి టెస్టు ఆడనుంది. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేత న్యూజిలాండ్ ప్రస్తుతం 126 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే ర్యాంకింగ్‌ మెరుగుపడుతుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత జట్టు మరోసారి మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉంది.

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ కోసం కెప్టెన్ అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌తో పాటు మరికొంత మంది ఆటగాళ్లు గత 7 రోజులుగా ముంబైలోని క్యాంప్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టు మొత్తం కాన్పూర్‌కు వెళ్లింది. కోల్‌కతాలో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత టెస్ట్ జట్టులోని 5 మంది ఆటగాళ్లు కూడా కాన్పూర్‌కు వెళ్లారు. భారత టెస్టు జట్టులో రోహిత్ శర్మ సభ్యుడు కాదు. ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు.

PF Clients: పీఎఫ్‌ ఖాతాదారులకు గమనిక..! ఇప్పుడు ఉద్యోగం మానేస్తే ఈ పని చాలా సులభం..

Zodiac Signs: ఈ 3 రాశులవారు వివాహానికి తొందరపడుతారు..! ఆ రాశులేంటో తెలుసా..?

8 బంతుల్లో సినిమా చూపించాడు.. 23 బంతుల్లో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు.. భయంకర బ్యాట్స్‌మెన్‌..?