PF Clients: పీఎఫ్‌ ఖాతాదారులకు గమనిక..! ఇప్పుడు ఉద్యోగం మానేస్తే ఈ పని చాలా సులభం..

PF Clients: EPF ను ఎంప్లాయర్ పెన్షన్ స్కీమ్ (EPS) అని కూడా పిలుస్తారు. దీనిని ప్రభుత్వ పెన్షన్ ఫండ్ సంస్థ EPFO నిర్వహిస్తుంది. వ్యవస్థీకృత రంగాలలో ఉద్యోగం

PF Clients: పీఎఫ్‌ ఖాతాదారులకు గమనిక..! ఇప్పుడు ఉద్యోగం మానేస్తే ఈ పని చాలా సులభం..
Epfo
Follow us
uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Nov 22, 2021 | 5:31 PM

PF Clients: EPF ను ఎంప్లాయర్ పెన్షన్ స్కీమ్ (EPS) అని కూడా పిలుస్తారు. దీనిని ప్రభుత్వ పెన్షన్ ఫండ్ సంస్థ EPFO నిర్వహిస్తుంది. వ్యవస్థీకృత రంగాలలో ఉద్యోగం చేసేవారికి ఈ ఫండ్ నుంచి పెన్షన్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం జీతంలో కొంత భాగం పెన్షన్ ఫండ్‌కు కలుపుతారు. పనిచేసే కంపెనీ, ఉద్యోగి ఇద్దరూ ఇపిఎఫ్‌కు సహకరించాలి. తద్వారా ఉద్యోగి విరమణ చేస్తే పెన్షన్‌గా కొంత మొత్తాన్ని పొందుతాడు. ఈ పని యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా యుఎన్ ద్వారా జరుగుతుంది.

అయితే ఉద్యోగులు జాబ్‌ మానేసిన తర్వాత లేదా మరో కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు మీ పీఎఫ్‌ డబ్బులను విత్‌ డ్రా చేయాలన్నా లేదా ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా ఉద్యోగం మానేసిన తేదీని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులు గతంలో ఈ విషయంలో చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియ చాలా సులభం అయింది. ఇప్పుడు మీరు ఇంటివద్ద కూర్చొని ఉద్యోగం మానేసిన తేదీని అప్‌డేట్‌ చేయవచ్చు. కింది పద్దతులను అనుసరించడం ద్వారా మీ పని సులువు అవుతుంది.

1. దీని కోసం ముందుగా మీరు యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ని సందర్శించి ఈ లింక్‌పై క్లిక్ చేయండి తర్వాత మీ UAN నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి 2. దీని తర్వాత మీరు మేనేజ్ ఎంపికకు వెళ్లి మార్క్ ఎగ్జిట్‌పై క్లిక్ చేసి ఆపై డ్రాప్ డౌన్ మెనులో ఎంపిక చేసిన ఎంప్లాయిమెంట్ నుంచి PF ఖాతా నంబర్‌ను ఎంచుకోవాలి. ఈ ప్రక్రియ తర్వాత మీరు ఉద్యోగం మానేసిన తేదీ, దానికి గల కారణాలను తెలపాల్సి ఉంటుంది. 3. మీరు ఉద్యోగం మానేసిన కారణాన్ని నమోదు చేసిన వెంటనే OTP అభ్యర్థన ఎంపికపై క్లిక్ చేయాలి. దీని తర్వాత మీ ఆధార్ నమోదిత మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది దాన్ని అక్కడ నమోదు చేయాలి. 4. OTPని నమోదు చేసిన ఓకె ఎంపికను ఎంచుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉద్యోగం మానేసిన తేదీ అక్కడ అప్‌డేట్ అవుతుంది. 5. మీరు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్‌లో పేరు లేదా పుట్టిన తేదీ అప్‌డేట్ చేయాలనుకుంటే ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో సులభంగా చేయవచ్చు. ఈ తప్పును సరిదిద్దుకునే పూర్తి స్వేచ్ఛను EPFO మీకు కల్పిస్తుంది. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.

Kamal Haasan: కరోనా బారిన పడ్డ కమల్‌ హాసన్‌.. అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్‌..

Stock Market: మళ్ళీ పడిపోయిన రిలయన్స్ షేర్ల ధరలు .. భారీగా తగ్గిన మార్కెట్ కాప్.. బజాజ్ గ్రూప్ షేర్లు కూడా.. ఎంతంటే..

Corona Virus: ప్రజల నిర్లక్ష్యం.. రష్యాలో ఆగని కరోనా కల్లోలం.. మళ్ళీ భారీగా కేసులు నమోదు..