Corona Virus: ప్రజల నిర్లక్ష్యం.. రష్యాలో ఆగని కరోనా కల్లోలం.. మళ్ళీ భారీగా కేసులు నమోదు..

Corona Virus: రష్యా కోవిడ్ విజృంభణతో విలవిలాడుతోంది. గత కొన్ని రోజుల క్రితం తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అంతేకాదు రోజుకు..

Corona Virus: ప్రజల నిర్లక్ష్యం.. రష్యాలో ఆగని కరోనా కల్లోలం.. మళ్ళీ భారీగా కేసులు నమోదు..
Russia Corona
Follow us

|

Updated on: Nov 22, 2021 | 3:30 PM

Corona Virus: రష్యా కోవిడ్ విజృంభణతో విలవిలాడుతోంది. గత కొన్ని రోజుల క్రితం తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అంతేకాదు రోజుకు వెయ్యికి మందికి పైగా కరోనాతో మరణిస్తున్నారు. గత 24 గంటల్లో COVID-19 రెండవ అత్యధిక రోజువారీ మరణాలు నమోదయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రష్యాలో ఆదివారం COVID-19తో 1,252 మంది మరణించగా.. శనివారం రికార్డు స్థాయిలో 1,254 మరణాలు నమోదయ్యాయి. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అత్యధికంగా 74 మరణాలు నమోదు కాగా.. క్రాస్నోడార్ లో 69, రష్యా రాజధాని మాస్కో లో 64 మరణాలు సంభవించాయి.  రోజు రోజుకీ కరోనా బారిన పడినవారి సంఖ్య అధికమవుతుంది. గత కొన్ని రోజులుగా వరసగా 30వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు రోజూ వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి.

అయితే కరోనా వైరస్ నివారణకు ప్రపంచంలో మొదటగా వ్యాక్సిన్ ను తీసుకొచ్చింది రష్యానే.. అయినప్పటికీ అక్కడ కరోనా విజృంభణ ఆగకపోవడానికి కారణం.. వ్యాక్సిన్ వేయించుకోవడంలో ప్రజల చూపించిన నిర్లక్షమని అంటున్నారు. ఇప్పటి వరకూ అదే దేశ జనాభాలో కేవలం 40శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ ను తీసుకున్నారు. అంటే  146 మిలియన్ల జనాభాలో కేవలం 49 మిలియన్ల మం ది మాత్రమే పూర్తిగా టీకా వేయిం చుకున్నా రు. అంతేకాదు.. ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలో పూర్తిగా అలసత్వం ధోరణి ప్రదర్శిస్తున్నారని.. అందుకనే ఈ మహమ్మారి రోజురోజుకీ పెరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇక ప్రభుత్వం కరోనా కట్టడి కోసం వేతనంతో కూడిన సెలవులు ఇస్తే.. ప్రజలు విందు, వినోద కార్యక్రమాలకు ఆ సెలవులను ఉపయోగించుకున్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. మాల్స్, సినిమా హాల్స్, రెస్టారెంట్స్ పూర్తి స్థాయిలో ప్రజలతో నిండిపోతున్నాయంటే.. అక్కడ ప్రజలు కరోనాని ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు. ఏదైమైన ర‌ష్యా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన టీకా పంపిణీపై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రజలు కరోనని నిర్లక్ష్యంగా తీసుకుంటే ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందో రష్యాని చూసి తెలుసుకోవాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read:  భార్య కోసం ఇంటిని తాజ్ మహల్‌గా నిర్మించిన అభినవ షాజహాన్‌..ఎక్కడంటే..