Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ ఇంటికి ఎన్ని సంవత్సరాలు అద్దె కడితే.. అది మన సొంతమవుతుంది.! చట్టం ఏం చెబుతోంది?

ఒక వ్యక్తి ఓ ఇంటికి ఎక్కువ కాలంగా అద్దె కడుతుంటే.. ఆ ఇల్లు అతడి సొంతమవుతుందని అంటుంటారు. అందుకే చాలామంది..

ఓ ఇంటికి ఎన్ని సంవత్సరాలు అద్దె కడితే.. అది మన సొంతమవుతుంది.! చట్టం ఏం చెబుతోంది?
Owner
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 23, 2021 | 7:32 AM

ఒక వ్యక్తి ఓ ఇంటికి ఎక్కువ కాలంగా అద్దె కడుతుంటే.. ఆ ఇల్లు అతడి సొంతమవుతుందని అంటుంటారు. అందుకే చాలామంది యజమానులు తమ ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు అనేక కీలక విషయాలను గుర్తుపెట్టుకుంటారు. చట్ట ప్రకారం ఈ రూల్ గురించి కాసేపు పక్కన పెడితే.. దీనిని కొంతమంది నిజమని భావిస్తారు.. మరికొందరు నిజం కాదని కొట్టిపారేస్తారు. మరి అసలు అద్దెదారుడు ఎన్ని సంవత్సరాల పాటు ఓ ఇంట్లో అద్దె కడుతూ ఉండొచ్చు.? అలా ఉంటే అతడికి ఇంటిపై హక్కు ఉంటుందా.? అసలు చట్టం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

చట్టం ఏం చెబుతోంది?

న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, యజమానికి చెందిన ఎలాంటి ఆస్తిని అద్దెదారుడు తనదిగా క్లెయిమ్ చేయలేడు. అయితే ఇది వివిధ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా కూడా 12 సంవత్సరాల పాటు ఓ ఇంటికి అద్దె కడుతూ ఉంటున్నట్లయితే.. ఆ ఆస్తిపై అతడు హక్కు పొందుతాడు. అది కూడా అమ్మేందుకు కాదు. ఇంతకీ న్యాయ నిపుణులు చెబుతున్న అడ్వర్స్ పొసెషన్ అంటే ఏంటి? ఉదాహరణకు ఒక వ్యక్తి తన ఇంట్లో తనకు తెలిసిన వ్యక్తిని అద్దె కడుతూ నివాసం ఉండటానికి అవకాశం ఇస్తే.. అతడు 11 సంవత్సరాలకు పైగా నివసిస్తున్నట్లయితే, అతడు ఆ ఆస్తిపై హక్కు పొందినట్లే. అంటే ఆ వ్యక్తి ప్రతీ నెలా క్రమం తప్పకుండా అద్దె కడుతూ ఉండొచ్చన్న మాట. ఒకవేళ అతడు ఇంటి ఓనర్ ప్రమేయం లేకుండా ఆ ఇంటికి ఎలాంటి మరమత్తులు, లేదా రెనోవేషన్ చేయించకపోతే ఆ వ్యక్తి అద్దె కడుతూ జీవితాంతం ఆ ఇంట్లోనే ఉండొచ్చు. దీనిని అడ్వర్స్ పోసెషన్ అని అంటారు.

మరోవైపు ఒక వ్యక్తి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ.. ఆ రసీదుపై తన పేరు కలిగి ఉంటే.. ఖచ్చితంగా ఓనర్ షిప్ హక్కులు ఆ వ్యక్తి అర్హుడు. దీనికి సేల్ డీడ్‌తో సంబంధం లేదు. కానీ 12 సంవత్సరాల పాటు ఓ వ్యక్తి ఓ ఇంట్లో ఉంటూ.. దాని ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్, కరెంట్ బిల్లులు కడుతుంటే.. ఇక ఆ బిల్లులపై ఓనర్ పేరు ఉంటే.. అద్దెకు ఉంటున్న వ్యక్తికి ఆ ఇల్లు సొంతం అవ్వదు. కేవలం అద్దెదారుడిగా ఆ వ్యక్తి జీవితాంతం ఆ ఇంట్లో ఉండొచ్చు. అతన్ని ఖాళీ చేయించలేరు. కాగా, 12 సంవత్సరాల కంటే ఎక్కువగా ఒక ఇంట్లో ఉన్నవారిని అడ్వర్స్ టెనెంట్ అని అంటారు.