Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: 11 రైల్వే స్టేషన్‌ల అప్‌గ్రేడ్‌ పనులకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం..

Indian Railway: రవాణా వ్యవస్థలో అతిపెద్దది భారతీయ రైల్వేశాఖ. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ..

Indian Railway: 11 రైల్వే స్టేషన్‌ల అప్‌గ్రేడ్‌ పనులకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం..
Follow us
Subhash Goud

|

Updated on: Nov 23, 2021 | 7:23 AM

Indian Railway: రవాణా వ్యవస్థలో అతిపెద్దది భారతీయ రైల్వేశాఖ. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎప్పటికప్పుడు సదుపాయాలను మెరుగు పరుస్తుంటుంది. రైల్వే స్టేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రయాణికులకు అవసరమైన పనులను చేపడుతూ ఉంటుంది. ఇక తాజాగా దేశంలోని 11 రైల్వే స్టేషన్‌ల అప్‌గ్రేడ్‌ పనులకు రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రైల్వే బోర్డు అన్ని జోన్‌ రైల్వేల జనరల్‌ మేనేజర్‌లకు లేఖ రాసింది. 21 స్టేషన్‌ల జాబితా, వాటి ఎగ్జిక్యూటింగ్‌ ఏజన్సీకి కొనసాగింపు, మరో 11 స్టేషన్‌ల కోసం ఎగ్జిక్యూటింగ్‌ ఏజన్సీల జాబితాను లేఖలో పొందుపర్చింది. అయితే వీటి మాస్టర్‌ ప్లాన్స్‌ను రైల్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి పొందవచ్చని తెలిపింది.

11 రైల్వే స్టేషన్‌ల అప్‌గ్రేడ్‌ పనుల జాబితా

1. ఛండీగఢ్‌ 2. లుధియానా 3. సికింద్రాబాద్‌ 4. గ్వాలియర్‌ 5. అసన్సోల్‌ 6. ఎర్నాకులం టౌన్‌ 7. ముజఫర్‌పూర్‌ 8. సోమనాథ్‌ 9. కాట్పాడి 10. జమ్మూతావి 11. ఫరీదాబాద్‌

ఇవి కూడా చదవండి:

IRCTC Tickets: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. నెలకు ఐఆర్‌సీటీసీలో ఎన్ని టికెట్లు బుక్‌ చేసుకోవచ్చో తెలుసా..?

Garments: బట్టలు కొనుగోలు చేసేవారికి షాకింగ్‌.. ఇక వీటి ధరలు కూడా పెరగనున్నాయ్‌.. ఎందుకంటే..!

Jan Dhan Accounts: ఖాతాదారులకు ఎస్‌బీఐ షాక్‌.. పొరపాటున వసూలు చేసిన రూ.254 కోట్లు.. బ్యాంకుపై ఫిర్యాదు..!