IRCTC Tickets: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. నెలకు ఐఆర్‌సీటీసీలో ఎన్ని టికెట్లు బుక్‌ చేసుకోవచ్చో తెలుసా..?

IRCTC Tickets:  మీరు కుటుంబం మొత్తం కలిసి విహారయాత్రకు వెళ్లాలనుకుంటే ముందుగానే రైలు టికెట్లు బుక్‌ చేసుకోవడం ఎంతో ముఖ్యం. చాలా మంది రైలు ప్రయాణం చేయాలంటే..

IRCTC Tickets: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. నెలకు ఐఆర్‌సీటీసీలో ఎన్ని టికెట్లు బుక్‌ చేసుకోవచ్చో తెలుసా..?
Follow us

|

Updated on: Nov 22, 2021 | 9:06 AM

IRCTC Tickets:  మీరు కుటుంబం మొత్తం కలిసి విహారయాత్రకు వెళ్లాలనుకుంటే ముందుగానే రైలు టికెట్లు బుక్‌ చేసుకోవడం ఎంతో ముఖ్యం. చాలా మంది రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకుంటారు. ప్రతి రోజు ఈ ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ద్వారా లక్షలాది టికెట్లు బుక్‌ అవుతున్నాయి. అయితే ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ నుంచి ప్రతి నెలకు 12 టికెట్లను బుక్‌ చేసుకునేందుకు రైల్వే శాఖ అనుమతిస్తుంది. గతంలో ఐఆర్‌సీటీసీ నుంచి కేవలం 6 టికెట్లు మాత్రమే బుక్‌ చేసుకునేందుకు వెసులుబాటు ఉండేది. కానీ ఈ సంఖ్యను ఇప్పుడు పొడిగించింది ఐఆర్‌సీటీసీ. అయితే మీరు రైలు టికెట్లను బుక్‌ చేసుకోవాలంట ఐఆర్‌సీటీసీ ఖాతాకు ఆధార్‌ లింక్‌ చేసుకోవడం తప్పనిసరి.

ఐఆర్‌సీటీసీకి ఆధార్‌ లింక్‌ చేయడం ఎలా..? ► ముందుగా ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ www.irctc.co.in లింక్‌పై ఓపెన్‌ చేయాలి. లాగిన్‌ అయిన తర్వాత అక్కడ కనిపించే అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.

► ఎగువన మెనులో అకౌంట్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత లింక్‌ యువర్‌ ఆధార్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

► అపై ఆధార్‌ నంబర్‌ లేదా వర్చువల్‌ ఐడీని నమోదు చేయాలి.

► చెక్‌ బాక్స్‌ను ఎంచుకుని ఓటీపీపై క్లిక్‌ చేయాలి.

► మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేసి ధృవీకరించాలి.

► ఇప్పుడు ఆధార్‌ నుంచి అందుకున్న కేవైసీని తనిఖీ చేయండి. ఆధార్‌ ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయడానికి అప్‌డేట్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి. కేవైసీ, ఆధార్‌ ఐఆర్‌సీటీసీకి లింక్‌ చేయబడిన తర్వాత మీ స్క్రీన్‌పై నిర్ధారణ సందేశం కనిపిస్తుంది.

► ఇక లాగ్‌ ఔట్‌ చేసిన తర్వాత మళ్లీ ఐఆర్‌సీటీసీ లాగిన్‌ కావాలి.

► మీ ఆధార్‌ కేవైసీ స్థితిని తెలుసుకునేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అకౌంట్‌ను లింక్‌ అయిన విషయాన్ని తనిఖీ చేసుకోవచ్చు.