Garments: బట్టలు కొనుగోలు చేసేవారికి షాకింగ్.. ఇక వీటి ధరలు కూడా పెరగనున్నాయ్.. ఎందుకంటే..!
Garments: వచ్చే సంవత్సరం నుంచి రూ.1000లోపు ఉన్న గార్మెంట్స్ ధరలు పెరగనున్నాయి. గార్మెంట్స్ ఇండస్ట్రీలో 85 శాతం రూ. వెయ్యి లోపే విలువగలవే ఉంటాయి. ఎందుకంటే..
Updated on: Nov 21, 2021 | 9:27 PM

Garments: వచ్చే సంవత్సరం నుంచి రూ.1000లోపు ఉన్న గార్మెంట్స్ ధరలు పెరగనున్నాయి. గార్మెంట్స్ ఇండస్ట్రీలో 85 శాతం రూ. వెయ్యి లోపే విలువగలవే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు దానిపై అమలు చేసిన ఐదు శాతం జీఎస్టీ స్లాబ్ 12 శాతానికి పెరగనుంది. దీంతో ఈ బట్టల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ మేరకు ఈనెల 18న రూ.1000 విలువగల గార్మెంట్ మీద జీఎస్టీ స్లాబ్‌ను 12 శాతానికి పెంచుతున్నట్లు నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీని బట్టి రూ.1000 విలువ ఉన్న గార్మెంట్స్ పై కూడా 12 శాతం జీఎస్టీ వసూలు చేయనుందని ఐసీసీ చైర్మన్ సంజయ్ కే జైన్ పేర్కొన్నారు.

దీంతో ఈ బట్టలు కొనుగోలు చేసేవారు కూడా తమ దుస్తులపై 7 శాతం జీఎస్టీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే నూలు ధర 25 శాతం వరకు పెరిగింది. రూ. 1000 లోపు ఉన్న గార్మెంట్స్‌పై జీఎస్టీ పెంచడంతో నూలుపై వచ్చే ఇన్‌పుట్ పన్ను క్రెడిట్ సాయపడదని ఆయన అన్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం గార్మెంట్ పరిశ్రమ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు ఉంటే జీఎస్టీ భారం రూ.8.5 లక్షల కోట్లపై పడుతుందని ఆయన వివరించారు. ఈ జీఎస్టీ పెంపుతో ఈ దుస్తులు కొనుగోలు చేసేవారికి మరింత భారం కానుంది.





























