Stock Market: మళ్ళీ పడిపోయిన రిలయన్స్ షేర్ల ధరలు .. భారీగా తగ్గిన మార్కెట్ కాప్.. బజాజ్ గ్రూప్ షేర్లు కూడా.. ఎంతంటే..
వారంలో మొదటి రోజు సోమవారం స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం కనిపించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 1600 పాయింట్లు నష్టపోయి 58,125కు చేరుకుంది.
Stock Market: వారంలో మొదటి రోజు సోమవారం స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం కనిపించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 1600 పాయింట్లు నష్టపోయి 58,125కు చేరుకుంది. మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లు తగ్గింది. అంటే నిమిషానికి రూ.7,500 కోట్ల మేర పతనమైంది. బజాజ్ గ్రూప్ షేర్లు 5-5% క్షీణించాయి. రిలయన్స్ షేర్లు కూడా భారీగా తగ్గాయి. దీంతో రిలయన్స్ మార్కెట్ కాప్ పడిపోయింది.
ఈరోజు సెన్సెక్స్ 68 పాయింట్లు పెరిగి 59,778 వద్ద కొనసాగింది. కానీ నిమిషాల వ్యవధిలోనే 500 పాయింట్లకు పైగా పడిపోయింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.258.92 లక్షల కోట్లకు తగ్గింది. గురువారం ఇది రూ.269.20 లక్షల కోట్లుగా ఉంది. పేటీఏం(Paytm) షేర్ ఈరోజు 16% పడిపోయి రూ.1,291కి చేరుకుంది. మార్కెట్ క్యాప్ రూ.85,000 కోట్లకు చేరుకుంది.
రిలయన్స్ కారణంగా..
ఈరోజు మార్కెట్ పతనానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ప్రధాన కారణం. రిలయన్స్ షేరు 5 శాతం పతనమై రూ.2,352కు చేరుకుంది. ఈరోజు దాని మార్కెట్ క్యాప్ 70 వేల కోట్లు తగ్గింది. గత వారంలో కూడా రిలయన్స్ స్టాక్ దాదాపు 10% నష్టపోయింది. సౌదీ అరామ్‌కోతో ఒప్పందం ప్రస్తుతానికి పునరుద్ధరించే ఆలోచన ఉందని కంపెనీ శుక్రవారం ఆలస్యంగా ఒక ప్రకటన చేసింది. దీని కోసం మళ్లీ వాల్యుయేషన్ చేస్తారు. ఈ ప్రకటన తరువాతా షేర్ మార్కెట్ ఈరోజు మొదటిసారిగా తెరుచుకుంది. దీంతో ఈ ప్రభావం దాని స్టాక్‌పై పడింది. సౌదీ అరామ్‌కో రిలయన్స్ ఆయిల్ టు కెమికల్ (O2C) వ్యాపారంలో 20% వాటాను కొనుగోలు చేయాలనుకుంటోంది. 15 బిలియన్ డాలర్లకు డీల్ జరగనుంది. ఈ ఒప్పందంపై చర్చలు మొదటిసారి ఆగస్టు 2019లో ప్రారంభమయ్యాయి.
ఒక నెల కనిష్టానికి రిలయన్స్
ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఒక నెల కనిష్ట స్థాయికి చేరుకుంది. దీని మార్కెట్ క్యాప్ రూ.15.18 లక్షల కోట్లు. మరోవైపు పేటీఎం షేర్లలో రెండో రోజు కూడా పతనం కొనసాగుతోంది. దీని మార్కెట్ క్యాప్ లక్ష కోట్ల కంటే దిగువన 90 వేల కోట్లకు పడిపోయింది. ఈ షేరు 16% నష్టపోయి 1,291 రూపాయలకు చేరుకుంది. అంటే, ఇష్యూ ధరతో పోల్చితే ఇది 29% విచ్ఛిన్నమైంది. నాయికా(Nykaa, జోమాటో(Zomato) మార్కెట్ క్యాప్‌లో పేటీఎంని అధిగమించాయి.
మారుతీ షేరు 2.34 శాతం పడిపోయింది..
బిఎస్‌ఇ సెన్సెక్స్‌లో అతిపెద్ద పతనం మారుతీ షేరులోనే ఉంది. 2.34 శాతం తగ్గింది. కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీ వంటి షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బీఎస్‌ఈలోని 30 షేర్లలో 6 షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. పెరుగుతున్న స్టాక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్ ఈరోజు 6% పెరిగింది. 755 రూపాయలతో ఈ ఏడాది సరికొత్త గరిష్టానికి చేరుకుంది. భారతి తన ప్రీపెయిడ్ ప్లాన్ టారిఫ్‌ను పెంచనున్నట్లు తెలిపింది. దాని కారణంగా, ఈ రోజు దాని షేర్లు పెరిగాయి. దీంతో పాటు పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్ షేర్లు కూడా లాభపడ్డాయి.
నిఫ్టీ 452 పాయింట్లు పడిపోయింది..
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 350 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ ప్రస్తుతం 17,312 వద్ద ట్రేడవుతోంది. ఈరోజు నిఫ్టీ 17,796 వద్ద ప్రారంభమైంది. రోజులో అది 17,611 వద్ద కనిష్ట స్థాయిని నమోదు చేయగా, గరిష్టంగా 17,805 వద్ద నిలిచింది. నిఫ్టీలోని 50 షేర్లలో 39 షేర్లు క్షీణించగా, 11 షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్, నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలు క్షీణించాయి. మిడ్‌క్యాప్ 1% కంటే ఎక్కువ తగ్గింది. నిఫ్టీలో పడిపోయిన షేర్లలో రిలయన్స్, మారుతీ, కోల్ ఇండియాతో పాటు టాటా మోటార్స్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు.. ఎన్ని వేల కోట్లకు పెరిగాయంటే..